AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Visit: ఓయూ చుట్టూ పొలిటికల్ హై ఓల్టేజ్ ఎపిసోడ్.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

Telangana: హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్.. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి వేదిక అయింది. ఇప్పుడు దీని చుట్టూ పొలిటికల్ హీట్ రాజుకుంది.  కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఓయూ విజిట్‌ ప్లాన్‌పై పంచాయతీ కొనసాగుతోంది.

Rahul Gandhi Visit: ఓయూ చుట్టూ పొలిటికల్ హై ఓల్టేజ్ ఎపిసోడ్.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
OU
Janardhan Veluru
|

Updated on: May 03, 2022 | 5:26 PM

Share

Telangana: హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి వేదిక అయ్యింది. ఇప్పుడు దీని చుట్టూ పొలిటికల్ హీట్ రాజుకుంది.  కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఓయూ విజిట్‌ ప్లాన్‌పై పంచాయతీ కొనసాగుతోంది. తమ నిర్ణయంలో మార్పు లేదని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్ స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. నిన్నటివరకు కాంగ్రెస్‌ ఆందోళనలతో అట్టుడికితే, ఇవాళ TRSV నిరసనలతో దద్దరిల్లింది. రాహుల్‌గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు TRSV కార్యకర్తలు. రాహుల్‌ దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసనకు దిగారు.

మరోవైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఘర్షణ వాతావరణం సృష్టించడమే కాకుండా.. విద్యార్థుల మధ్య ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులకు , సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.

రాహుల్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఓయూలోకి తీసుకెళ్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఏ ఉద్ధేశంతో ఓయూకి వెళ్తారో చెప్పాలని టీఆర్‌‍ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ని కలవబోతున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. వైస్ ఛాన్సలర్(వీసీ) నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టి నేరుగా సీఎం దగ్గరికే వెళ్లి తేల్చుకుంటామంటున్నారు.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏ ఉద్ధేశంతో ఓయూలోకి రాహుల్ వెళ్తారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న ఓయూలో అలజడి సృష్టించడమే కాంగ్రెస్ ఉద్దేశమంటూ ధ్వజమెత్తారు.

ఆరు నూరైనా ఓయూలో రాహుల్‌ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలో.. ఏం చేయాలో తెలుసని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్ ఎపిసోడ్ నడుస్తోంది.

Also Read..

Andhra Pradesh: ఏపీలో మరో దుర్ఘటన.. అర్థరాత్రి సమయంలో తలుపు కొట్టి.. తీయగానే అత్యాచారానికి పాల్పడి..

IPL 2022: ‘అతను మరో మహేంద్ర సింగ్ ధోని.. కూల్‌గా క్లైమాక్స్‌లో విధ్వంసం’