Hyderabad: నగర శివారులో మృతదేహాల కలకలం.. కుళ్లిన స్థితిలో రెండు డెడ్ బాడీస్ లభ్యం

హైదరాబాద్‌(Hyderabad) నగర శివారులో మరోసారి మృతదేహాల లభ్యం కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) వద్ద రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. కొత్తగూడెం బ్రిడ్జ్‌ దగ్గర ఇద్దరి...

Hyderabad: నగర శివారులో మృతదేహాల కలకలం.. కుళ్లిన స్థితిలో రెండు డెడ్ బాడీస్ లభ్యం
Abdullapurmet
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 03, 2022 | 4:00 PM

హైదరాబాద్‌(Hyderabad) నగర శివారులో మరోసారి మృతదేహాల లభ్యం కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) వద్ద రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. కొత్తగూడెం బ్రిడ్జ్‌ దగ్గర ఇద్దరి మృతదేహాల్ని గుర్తించారు స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీస్ ను పరిశీలించారు. ఆ రెండు మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. అందులో ఒకటి మహిళ మృతదేహం కాగా.. మరొకటి యువకుడి డెడ్‌ బాడీగా గుర్తించారు. ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలోనూ అబ్దుల్లాపూర్‌మెట్‌ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రహదారి నుంచి కోహెడ వెళ్లే దారి సమీపంలోని కాలువలో ఓ మహిళ మృతదేహం దొరికింది. మరో ఘటనలో ఎల్బీ నగర్‌లోని బైరామల్‌ గూడ వద్ద నాలాలో అదేరోజు ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడి ముఖం చిధ్రమై గుర్తుపట్టని స్థితిలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం శేరిగూడాలోని ఓ వెంచర్‌లో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

నగర శివారులో వరుసగా వెలుగులోకి వస్తున్న మృతదేహాల లభ్యం ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓఆర్‌ఆర్‌ సర్వీస్ రోడ్​లో పోలీసుల గస్తీ ముమ్మరం చేసి ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరముందని కోరుతున్నారు. దీంతో ఓఆర్​ఆర్​ సర్వీసు రోడ్డుపై పోలీసులు దృష్టి సారించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Fact Check: వారికి ప్రతీ నెలా రూ.1800 పించన్.? వైరల్ ట్వీట్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..