God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..

ఆచార్య సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరు..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..
Thaman
Follow us
Rajitha Chanti

|

Updated on: May 03, 2022 | 2:52 PM

ఆచార్య సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరు.. చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. దేవాలయాలలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డే, సోనూసూద్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమానే కాకుండా.. ప్రస్తుతం చిరు చేతిలో ఇంకా మూడు సినిమాలున్నాయి. అందులో గాడ్ ఫాదర్, భోళా శంకర్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‏లో ప్రతిష్టాత్మకంగా 153వ చిత్రంగా రాబోతున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మిస్తుండగా.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.

భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ లో మరో ప్రత్యేకమైన ఆకర్షణ చేరింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి- సల్మాన్ ఖాన్ పై ఒక ఎలెక్ట్రిఫయింగ్ సాంగ్ ని షూట్ చేయబోతుంది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ సంగీత దర్శకుడు మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ” గ్రేట్ న్యూస్. బాస్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కోసం ప్రభుదేవా ఆటమ్ బాంబింగ్ స్వింగింగ్ లాంటి పాటని కోరియోగ్రఫీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ కలసి డ్యాన్స్ చేయడం అభిమానులకు ఒక పండగలా వుండబోతుంది” అని ట్వీట్ చేశారు తమన్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కలసిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ చివరి దశలోఉంది. ఈ మెగా చిత్రంలో హీరో సత్యదేవ్ కూడా పూర్తి నిడివి వున్న పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్ కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Balakrishna : “మీ అకుంఠిత దీక్షకు నా సలాం”..ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

చున్నీ చాటున దాగి ఉన్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా..

Chiranjeevi :మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. సీనియర్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయనున్న మెగాస్టార్..

NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్