NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంచలన విజయం అందుకున్న అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.

NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: May 03, 2022 | 8:45 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంచలన విజయం అందుకున్న అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని( Gopichanda Malineni)దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 107 సినిమా గా ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. క్రాక్ సినిమాతో మంచి అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య కోడం ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. బాల‌య్య‌107వ సినిమాగా ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్   సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ) పరిసరప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు. న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో పేరు ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్, టైటిల్ ను ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

Upasana konidela : 150 వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్న రామ్ చరణ్ సతీమణి..