AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు.

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
Raviteja
Rajitha Chanti
|

Updated on: May 03, 2022 | 2:50 PM

Share

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. ఇటీవల ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. దీంతో ఈసారి రాబోయే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ఏలాగైనా మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‎లో భాగంగా సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ‘బుల్ బుల్ తరంగ్’ పాట విడుదలైన చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఆకట్టుకుంది. ఈ పాటలో రవితేజ తనదైన శైలిలో హుషారుగా కనిపించి, డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్స్ తో కూల్ అండ్ క్లాస్ గా అలరించారు. సింగింగ్ సంచలనం సిద్ శ్రీరాం వాయిస్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈరోజు ఈద్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రవితేజ ఒక మసీదు ముందునుండి తన అంబాసిడర్ కారు వైపు ఫుల్ ఎనర్జీటిక్ గా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్‏లో కనిపిస్తుంది. పోస్టర్‏లో రవితేజ లుక్ సూపర్ ఫిట్ గా అభిమానులని అలరించింది. ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ సొట్ట బుగ్గల్లో మే 7న విడుదల కానుంది. ఈ పాట అదిరిపోయే డ్యాన్సింగ్ సాంగ్ గా అలరించబోతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Balakrishna : “మీ అకుంఠిత దీక్షకు నా సలాం”..ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

చున్నీ చాటున దాగి ఉన్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా..

Chiranjeevi :మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. సీనియర్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయనున్న మెగాస్టార్..

NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్