Chiranjeevi :మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. సీనియర్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయనున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మెగాస్టార్.

Chiranjeevi :మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. సీనియర్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయనున్న మెగాస్టార్..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: May 03, 2022 | 9:53 AM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మెగాస్టార్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం చిరు మోహన్ రాజ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మళయాలంలో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమా రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా రానుంది. ఈ సినిమాలో నయన తార నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారట.అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాతోపాటు భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు చిరు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్‏గా భోళా శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చెల్లెల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఈ స్టోరీ రూపొందుతుండగా.. ఇందులో చిరు చెల్లెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆతర్వాత బాబీ డైరెక్షన్ లో ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు. వీటితోపాటు వెంకీ కుడుములు తో ఓ సినిమాను కూడా లైనప్ చేశారు. అయితే ఇప్పుడు మరో సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. తన మిత్రురాలు అయిన నటి రాధిక బ్యానర్ లో కూడా ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నాడట. సీనియర్ హీరోయిన్ రాధిక ప్రొడక్షన్ హౌస్ లో కూడా చిరంజీవి సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్నీ రాధిక స్వయంగా పంచుకున్నారు. తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నాడని తెలిపారు. తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆమె ప్రకటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

Upasana konidela : 150 వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్న రామ్ చరణ్ సతీమణి..