Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeev) ప్రస్తుతం ఆచార్య విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వరుస సినిమాలతో..

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 03, 2022 | 3:27 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeev) ప్రస్తుతం ఆచార్య విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వరుస సినిమాలతో.. షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్న చిరు… ఇప్పుడిప్పుడే రిలీఫ్ అవుతున్నారు. తాజాగా తన సతీమణి సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు.. ఈ విషయాన్ని చిరు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. “కరోనా పాండమిక్ తర్వాత తొలిసారి అంతర్జాతీయ ప్రయాణం. చాలా కాలం తర్వాత సురేఖతో కలిసి హాలీడే కోసం యూఎస్ఏ, యూరప్‏కు బయలుదేరుతున్నాం. మీ అందరినీ త్వరలో కలుద్దాం ” అంటూ సతీమణితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు చిరు. దీంతో చిరంజీవి షేర్ చేసిన ఫోటోపై ఆయన కోడలు ఉపాసన రియాక్ట్ అయ్యారు.. హ్యాప్పీ టైమ్ అత్తయ్య.. మామయ్య అంటూ కామెంట్ చేయగా.. మరోవైపు సినీ ప్రముఖులు, అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.

ఇటీవల ఆచార్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మిస్తుండగా.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాను లూసీఫర్ చిత్రానికి రీమేక్‏గా తెరకెక్కిస్తున్నారు. అలాగే సీనియర్ నటి రాధిక.. శరత్ కుమార్ నిర్మాణంలోనూ చిరంజీవి ఓ మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Balakrishna : “మీ అకుంఠిత దీక్షకు నా సలాం”..ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

చున్నీ చాటున దాగి ఉన్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా..

Chiranjeevi :మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. సీనియర్ హీరోయిన్‌తో కలిసి సినిమా చేయనున్న మెగాస్టార్..

NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్