Medico Preethi Case: ఖమ్మం జైల్ నుంచి విడుదలైన మెడికో సైఫ్.. అరెస్టైన దాదాపు 56 రోజుల తర్వాత బెయిల్
ప్రీతి కేసులో 56 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యాడు డాక్టర్ సైఫ్. తమ కుమారుడు ఏ తప్పు చేయలేదని.. సీనియర్, జూనియర్ల మధ్య వేధింపులు లేవని చెప్పారు సైఫ్ పేరెంట్స్.

తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ సైఫ్‌కు బెయిల్ బయటకొచ్చాడు. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రీతి మృతి కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న డాక్టర్ సైఫ్.. ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 60 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ బుధవారం నాటికి 58 రోజులు అవుతున్న సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు విన్పించారు. వాదనల అనంతరం కోర్టు సైఫ్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే చార్జి షీట్ దాఖలు చేసేనాటికి లేదా 16 వారాల వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని షరతు విధించింది కోర్టు.
వ్యక్తిగతంగా రూ.10 వేల బాండ్, ఇద్దరు జమానత్‌దారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ కేసులో సాక్షులపై కానీ, మృతురాలి కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ప్రాసిక్యూషన్ వారికి బెయిల్ రద్దు కోరే అవకాశం ఇస్తూ కోర్టు ఆదేశించింది.
సైఫ్‌కి బెయిల్ ఇచ్చిన కోర్ట్.. కండీషన్స్ అప్లై అంటోంది. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసు విచారణ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేయడం జరుగుతుందని న్యాయస్థానం పేర్కొంది. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ ప్రీతి మృతి కేసులో రెండు కీలక పరిణామాలు ఇవాళ చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం