AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం… ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం

మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. జగదేవపూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో మెదక్ జిల్లాలోని తూప్రాన్ వెళ్తుండగా.. అలిరాజ్​పేట వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.

Telangana: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం... ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం
Road Accident
Ram Naramaneni
|

Updated on: May 26, 2022 | 4:59 PM

Share

Road Accident: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నొత్తురోడాయి. ఏపీలోని కృష్ణా(Krishna District), అన్నమయ్య జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. తాజాగా తెలంగాణలో కూడా ఘోర ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం( Jagdevpur Mandal) అలిరాజ్​పేట్ బ్రిడ్జి వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీకొనడంతో.. నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. యాక్సిడెంట్‌లో  కనకయ్య, కవితలు ఇద్దరు స్పాట్‌లోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డ నలుగురిని… గజ్వేల్​ ఆసుపత్రికి తరలించారు. వారి కండీషన్ క్రిటికల్‌గా ఉండటంతో వెంటనే వారిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారిలో మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. మిగిలినవారిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతులందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారిగా గుర్తించారు. జగదేవపూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో మెదక్ జిల్లాలోని తూప్రాన్​లో ఓ ఫంక్షన్‌కి వెళ్తుండగా.. అలిరాజ్​పేట వద్ద లారీని ఢీకొంది. ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోవడంతో జగదేవపూర్‌లో తీవ్ర విషాదం నెలకుంది. మృతుల కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow Us