CM KCR: మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. దేశ రాజకీయాలపై విస్తృత చర్చ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరు చేరుకున్నారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. మధ్యాహ్న...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరు చేరుకున్నారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. మధ్యాహ్న భోజనం చేశాక.. ప్రస్తుత జాతీయ రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలపై వారు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా పద్మనాభనగర్‌లోని దేవెగౌడ ఇంటి పరిసరాల్లో కేసీఆర్ కటౌట్లను అభిమానులు ఏర్పాటు చేశారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్.. అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బెంగళూరు నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి