Tirupati Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు
Railway News/IRCTC: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం రైల్వే శాఖ ఇప్పటికే దేశ నలుమూలల నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
Special Trains: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం రైల్వే శాఖ ఇప్పటికే దేశ నలుమూలల నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగం సికింద్రాబాద్ (Secunderabad) – తిరుపతి (Tirupati) మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా 8 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.02764) జూన్ 4, 11, 18, 25 తేదీల్లో(శనివారం రోజున) సాయంత్రం 06.40 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం (ఆదివారం నాడు) 06.45 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కి చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యే రైలు (నెం.02763) జూన్ 5, 12, 19, 26 తేదీల్లో (ఆదివారం) సాయంత్రం 5 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు(సోమవారం) ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలు (నెం.02764) జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కి వెళ్లే ప్రత్యేక రైలు (నెం.02763) రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమయ్యింది.
మరిన్ని ఏపీ వార్తలు ఇక్కడ చదవండి..