AP Weather Alert: బలపడుతున్న నైరుతి పవనాలు.. ఏపీలో రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు. లక్ష్యదీప్, ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రకటించారు.
AP Weather Alert: నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం తో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు రానున్న 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం మాల్దీవులు, లక్షద్వీప్‌లోని పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు. లక్ష్యదీప్, ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రకటించారు.
ఉత్తర కోస్తా, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి(మే 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా: ఈ రోజు, రేపు, ఎల్లుండి (మే 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అంతేకాదు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి (మే 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..