UNSC: UN భద్రతా మండలిలో జపాన్ సభ్యత్వానికి బైెడెన్ మద్ధతు.. మరి భారత్ తన గళం విప్పాల్సిందే..

UNSC: కేవలం ఐదు దేశాలకు మాత్రమే ఇప్పటి వరకు విటో పవర్ ఉంది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాలకు మాత్రమే ఇప్పటి వరకు విటో పవర్ సొంతం.

UNSC: UN భద్రతా మండలిలో జపాన్ సభ్యత్వానికి బైెడెన్ మద్ధతు.. మరి భారత్ తన గళం విప్పాల్సిందే..
Joe Biden
Follow us

|

Updated on: May 26, 2022 | 4:16 PM

UNSC: కేవలం ఐదు దేశాలకు మాత్రమే ఇప్పటి వరకు విటో పవర్ ఉంది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాలకు మాత్రమే ఇప్పటి వరకు విటో పవర్ సొంతం. కానీ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్ షిప్ కోసం జపాన్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ సమర్థించారు. జపాన్ ప్రయత్నానికి తాము సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో టోక్యోలో అమెరికా అధ్యక్షుడు ఒకరితో ఒకరు భేటీ అయిన సందర్భంలో ఈ విషయంపై చర్చ జరిగింది. గత సంవత్సరం భారత్ చేసిన ఇదే ప్రయత్నానికి జొబైడెన్ రెండు సార్లు మద్దతు ప్రకటించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఇదే విషయంపై డిమాండ్ పెరుగుతోంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో దేశాల సంఖ్య పెరగాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం దీనిలో ఉన్న కొన్ని దేశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం కొన్ని దేశాలకు మాత్రమే విటో పవర్ ఉండటం కారణంగా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే నలుగుతున్నాయని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. పర్మనెంట్ మెంబర్లకు మాత్రమే విటో పవర్ అనే సిద్ధాంతం విషయంలో మార్పులు అవసరమని వారు అంటున్నారు.

కేవలం కొన్ని దేశాల చేతిలోనే విటో పవర్ ఉండటం కారణంగా యూఎన్ పనితీరు బలహీనంగా మారుతోందని అనేక దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిశీలించినప్పుడు సైతం మనకు ఇది స్పష్టంగా కనిపిస్తోంది. సమస్య పరిష్కారానికి ఈ పవర్స్ అడ్డుపడుతున్నాయి. UNSC పనితీరు బాగుండాలంటే సమకాలీన వాస్తవాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. UNSC మరింత మంది సభ్యులు అవసరమంటూ ఇప్పటికే జపాన్, ఇండియా, జర్మనీ, బ్రెజిల్ తో పాటు ఆఫ్రికా దేశాలు సైతం తమ డిమాండ్లను వ్యక్తపరిచాయి. ప్రస్తుతం 193 దేశాలు యూఎన్ సభ్యులుగా ఉన్నప్పటికీ కేవలం ఐదు దేశాలో పర్మనెంట్ మెంబర్లుగా ఉన్నాయి. సూపర్ పవర్ స్థానం కోసం అమెరికా, రష్యా, చైనాలు చేస్తున్న ప్రయత్నాలు కోల్డ్ వార్ కు కారణంగా మారుతున్నాయి. ఇందువల్ల కేవలం పర్మనెంట్ సభ్యులు మాత్రమే విటో పవర్ కలిగి ఉండాలా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

డిసెంబర్ 1న, బాలిలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇండోనేషియా G-20 అధ్యక్ష పదవి ముగిసే సమయానికి, కనీసం ఐదుగురు సభ్యులకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలని భారత్ ప్రకటించాలి. P-5 దేశాల నుంచి ప్రజా నిబద్ధతను కోరాలి. ఎవరు హాజరవుతారు. వ్యతిరేకత విషయంలో, నిరసనకు చిహ్నంగా పరిమిత కాలం పాటు ప్రపంచ సంస్థలో దాని భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.