Telangana: వైద్య రంగంలో జరిగిన అభివృద్ధిని గ్రహించకపోవడం బాధాకరం.. కాంగ్రెస్ లీడర్స్ పై మంత్రి హరీశ్ ఫైర్
తెలంగాణ(Telangana) ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమీర్‌పేటలో 50 పడకల ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి...
తెలంగాణ(Telangana) ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమీర్‌పేటలో 50 పడకల ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి వైద్య రంగంపై కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా ఆస్పత్రి వైద్య సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని విజ్ఞప్తి మేరకు అమీర్ పేట(Ameerpet) ఆస్పత్రిని సందర్శించిన హరీశ్‌రావు పనితీరు మెరుగుపర్చుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ క్రింద చేసిన చికిత్సలకు సబంధించి వివరాలు లేకపోవడంతో ఆగ్రహం చెందారు. రోగులు ఆస్పత్రికి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. మంత్రి తలసానితో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. 10 కోట్లు వెచ్చించి 50 పడకల ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
గీతారెడ్డి ఓ వైద్యురాలై ఉండి, రాష్ట్రంలోని వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధిని గ్రహించకపోవడం చాలా బాధాకరం. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి చేస్తే ఇదే జగ్గారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే గతం, ప్రస్తుతమంతా ఆగమాగమే. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ గాంధీ అస్పత్రికి అత్యున్నత సౌకర్యాలు కల్పించారు. ఉస్మానియా అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించాం. 70 ఏళ్ల కాంగ్రెస్ మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేస్తే.. ఏడేళ్లలో 33 కళాశాలలు కట్టిన ఘనత టీఆర్ఎస్ దే.
– హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి, తెలంగాణ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి