Revanth Reddy: అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.. 24 గంటల కరెంట్ ఇచ్చేది మేమే: రేవంత్, భట్టి విక్రమార్క
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ రైతులకు ఉచిత విద్యుత్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంపైనే గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తానా సభల్లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై..

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ రైతులకు ఉచిత విద్యుత్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంపైనే గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తానా సభల్లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై రేవంత్ మాటలపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించారు టీపీసీసీ అధ్యక్షులు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది’ అని రేవంత్ రెడ్డి రాసుకొచ్చిరు. తద్వారా రైతులకు 24 గంటల కరెంట్ విద్యుత్‌పై జరుగుతోన్న ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు రేవంత్.
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఈ అంశంపై స్పందించారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని స్పష్టం చేశారు. ‘దేశంలో ఎక్కడ ఫ్రీ పవర్ ఇస్తున్నా అది కాంగ్రెస్ ఘనతే. బీఆర్‌ఎస్ లీడర్స్ గాలి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణకు కరెంట్ కష్టాలు రాకూడదనే విభజన టైమ్‌లో 53శాతం విద్యుత్ కేటాయించారు. ఇప్పుడున్న పవర్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదు ‘ అంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.




🔥కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది… వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది.
🔥కెసిఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది.#ByeByeKCR
— Revanth Reddy (@revanth_anumula) July 15, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..