Telangana: పల్లె మాటలు, సామెతలతో నెట్టింట ఫేమస్ అయిన రీల్స్ గౌరమ్మ..
నేటి ఆధునిక యుగంలో అన్ని వయసుల వారికి మొబైల్ వ్యామోహం, వినియోగం బాగా పెరిగింది. దీంతో దేశంలో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్‌లో రీల్స్‌కు రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ రీల్స్ చేసేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కాబట్టి రీల్స్ చేస్తూ ఒకేసారి ఫేమస్ అయిపోదామని చాల మంది ప్రయత్నిస్తూ ఉంటారు. నిరక్షరాసలైన ఓ వృద్ధురాలు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా రీల్స్ చేశారు. దీంతో ఆ రీల్స్‌ని ఇంటిపేరుగా మార్చుకొని ఫేమస్ అయ్యారు. ఆ వృద్ధురాలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రేణికుంటకు చెందిన గౌరమ్మ- భిక్షపతి దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ నిరక్షరాస్యలే.. గతంలో ఎప్పుడో ‘చదువు వెలుగు కార్యక్రమంలో రాత్రి బడికి వెళ్లి సంతకం మాత్రమే నేర్చుకున్న అక్షర పరిజ్ఞానం ఉంది. గౌరమ్మ.. పల్లెపదాలు, గ్రామీణ విచిత్రాలు, సామెతలు, కథలను మనమలు, మనమరాళ్లకు చెబుతుండేది. వారంతా వాటిని ఎంతో ఇంట్రెస్ట్‌తో వినేవారు. అయితే గతేడాది ఈ దంపతులు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. మనవరాలు రితికకు నానమ్మ గౌరమ్మ అంటే ఎంత ఇష్టం. అందుకే రితిక.. ‘గౌరమ్మ’ పేరు మీద యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసింది. గౌరమ్మ సామెతలు, పాటలను అప్ లోడ్ చేసింది. ఆ తర్వాత వీడియోలను ఎలా అప్ లోడ్ చేయాలో మనవరాలు రితిక నేర్పించింది. దీంతో గౌరమ్మ ఇప్పటివరకు పలు అంశాల మీద స్వయంగా 1120 వీడియోలు తీసి యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసింది. పల్లెపదాలు, సామెతలు, గ్రామీణ విచిత్రాలు, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన సందర్భాలను పురస్కరించుకొని తోటి కూలీలతో రీల్స్ చేసింది. వరినాట్లు, ఇంట్లో బోళ్లు కడిగే సందర్భం, నాలాల వద్ద అమ్మలక్కల ముచ్చట్లు, వాకిలి ఊడ్చే క్రమం, ముగ్గులు వేసే సమయంలో విభిన్నమైన సహజత్వంతో కూడిన రీల్స్‌ను గౌరమ్మ చేసింది. భర్త భిక్షపతితో కలిసి తీర్ధ యాత్రలు చేసిన సమయంలో ఇలా ఒకటేమిటి.. తోచిన సందర్భాన్ని బట్టి వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకుంది.
దీంతో అతి తక్కువ సమయంలోనే గౌరమ్మ 7,756 మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. దీంతో బంధువులు, స్థానికులు ఇంటిపేరును రీల్స్ గా మార్చి ఆమెను ‘రీల్స్ గౌరమ్మ’ అని పిలుస్తున్నారు. తాను చేసిన రీల్స్‌లో సోదరుడు ఉప్పలయ్య చనిపోయినప్పుడు ఆయన చిత్రపటాన్ని పట్టుకుని తీసిన వీడియోకు ఫాలోవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు. రీల్స్ చేయడంతో తనను రీల్స్ గౌరమ్మగా పిలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.
View this post on Instagram
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




