Telangana: బంగారం ధరను దాటేసిన ఎర్రబంగారం రేటు.. చరిత్రలోనే ఆల్‌టైమ్‌ రికార్డ్‌ బ్రేక్‌.. క్వింటాల్ ఎంతంటే..?

ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ఆరంభం నుండి పసిడితో పోటీ పడిన ఎర్రబంగారం ధరలు ఇప్పుడు బంగారం ధరను క్రాస్ చేసింది..

Telangana: బంగారం ధరను దాటేసిన ఎర్రబంగారం రేటు.. చరిత్రలోనే ఆల్‌టైమ్‌ రికార్డ్‌ బ్రేక్‌.. క్వింటాల్ ఎంతంటే..?
Ac Type Mirchi
Follow us

|

Updated on: Aug 29, 2022 | 4:28 PM

Telangana: ఎర్రబంగారం మరో రికార్డ్ బ్రేక్ చేసింది.. పసిడి ధరను క్రాస్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.. వరంగల్ లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా మిర్చికి 66వేల రూపాయల ధర పలికింది.. ఎర్రబంగారం సాగు చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డ్ కావడం విశేషం. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ యార్డుల్లో ఒకటైన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ లో ఈ రికార్డ్‌ ధర నమోదైంది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ఆరంభం నుండి పసిడితో పోటీ పడిన ఎర్రబంగారం ధరలు ఇప్పుడు బంగారం ధరను క్రాస్ చేసింది.. వరంగల్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా మిర్చికి 66 వేల రూపాయల రికార్డు ధర లభించింది. టమాట రకం మిర్చికి ఈ ధర లభ్యమైంది.

దుగ్గొండి మండలం మరిపెళ్లి గ్రామానికి చెందిన యార రవి అనే రైతు తను సాగుచేసిన 24 బస్తాల టమాట రకం మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చాడు..ఆ మిర్చిని ఈరోజు విక్రయించగా క్వింటాకు 66వేల రూపాయల రికార్డ్ ధర పలికింది. ఈ రికార్డ్ ధర సొంతం చేసుకున్న రైతు ఆనందం వ్యక్తం చేశాడు.

మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మిర్చికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా దేశీయ మిర్చిని పండిస్తారు. అకాల వర్షాలు, వైరస్ కారణంగా ఈ ఏడాది మిర్చి పంటు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి బాగా తగ్గింది. కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ ఉంచిన మిర్చికి ఇప్పుడు రికార్డ్‌ ధర పలికింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి