ఉత్తరాఖండ్‌లో మరో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు దుర్మరణం..పదుల సంఖ్యలో క్షతగాత్రులు..

ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో 37 మంది గాయపడ్డట్లు సమాచారం. ఇక్కడి కిచ్చా సమీపంలో..

ఉత్తరాఖండ్‌లో మరో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు దుర్మరణం..పదుల సంఖ్యలో క్షతగాత్రులు..
Road Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 28, 2022 | 4:47 PM

ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో 37 మంది గాయపడ్డట్లు సమాచారం. ఇక్కడి కిచ్చా సమీపంలో భక్తులతో నిండిన ట్రాలీ బోల్తా పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాద వార్త తెలియగానే ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన వార్త తెలియగానే పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

అందిన సమాచారం ప్రకారం.. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా శక్తి ఫారం ప్రాంతానికి చెందిన బాస్గర్ గ్రామానికి చెందిన సుమారు 45 నుండి 50 మంది భక్తులు ఆదివారం ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని ఉత్తమ్ నగర్‌లో ఉన్న గురుద్వారాకు ట్రాలీలో వెళ్తున్నారు. ఉత్తమ్ నగర్ గురుద్వారాలో ప్రతి ఆదివారం, గురుగ్రంథ సాహిబ్ పారాయణం,లంగర్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ట్రాలీలో బయలుదేరారు. సిర్సా అవుట్‌పోస్ట్ బరేలీ జిల్లాలోని బహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అవుట్‌ పోస్ట్ సమీపంలో ట్రాక్టర్ రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి