Telangana: బాసర ప్రజల్ని వెంటాడుతున్న భయం.. ! రాత్రుళ్లు వీధుల్లో గ్రామస్తుల పహారా..!!
ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు పల్లెల్లో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీనికి తోడు.. పల్లెల్లో వీధిదీపాలు వెలగక.. రాత్రుళ్లు జనాలు మరింత భయంతో వణికిపోతున్నారు.
Telangana: నిర్మల్ జిల్లా బాసర మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు పల్లెల్లో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీనికి తోడు.. పల్లెల్లో వీధిదీపాలు వెలగక.. రాత్రుళ్లు జనాలు మరింత భయంతో వణికిపోతున్నారు. గత రెండు రోజులుగా సరిహద్దు ప్రాంతాలలో దొంగల ముఠా సంచరిస్తుందన్న సమాచారంతో బాసర మండల ప్రజలకు భయంపట్టుకుంది. ఇక రాత్రుల్లో జనాలు స్వచ్ఛందంగా కట్టెలు పట్టుకుని గస్తీ తిరుగుతున్నారు.పగటి పూట కూడా దొంగల సంచారం ఉండటంతో స్థానికులు క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు.
బాసర మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో దొంగల భయంతో స్థానికులు రాత్రుళ్లు పహారాకాస్తున్నారు. గ్రామస్తులు, యువకులు సుమారు 50 మంది వరకు రాత్రి వీధుల్లో తిరుగు గస్తీ నిర్వహించారు. బాసర మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు దొంగల భయంతో వణికిపోతున్నారు. ఇటివల మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుక లోని పలు గ్రామాల్లో రాత్రి వేళలో ఇండ్లల్లో చొరబడి చోరికి పాలుపడుతున్నారని, గ్రామాల్లో దొంగల ముఠా తిరుగుతూ చోరీ చేస్తుందని సోషల్ మీడియాలలో వస్తున్న పుకార్లతో ప్రజలు మరింతగా భయాందోళన చెందుతున్నారు.
బాసర మండలం లోని మహరాష్ట్ర బార్డర్ లో గల గ్రామాలైన టాక్లి, దొడాపూర్, బాసర, కిర్గుల్(కె), గ్రామాలలో గ్రామస్తులు,యువకులు రాత్రి వేళ జాగరణ చేస్తూ గల్లి, గల్లి లో తిరుగుతూకాపాలా కాస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి