Amitabh Bachchan: స్టార్​హీరోకు అరుదైన గౌరవం.. అతనే దేవుడంటూ అమెరికాలో విగ్రహం ఏర్పాటు.. ధర తెలిస్తే కంగుతింటారు..

అమితాబ్ విగ్రహాన్ని ఓ పెద్ద గాజు బాక్స్‌లో ఉంచారు. బిగ్‌బీ విగ్రహ ఆవిష్కరణ వేడుక సందర్భంగా సుమారు 600 మంది అభిమానులు హాజరయ్యారు. ఇండియన్‌ సూపర్‌స్టార్‌..

Amitabh Bachchan: స్టార్​హీరోకు అరుదైన గౌరవం.. అతనే దేవుడంటూ అమెరికాలో విగ్రహం ఏర్పాటు.. ధర తెలిస్తే కంగుతింటారు..
Amitabh Bachchan
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2022 | 4:04 PM

Amitabh Bachchan: బాలీవుడ్ సెలబ్రిటీలకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు, కొన్నిసార్లు తమ అభిమానతారల పట్ల తమ ప్రేమ, అభిరుచిని ప్రదర్శించడానికి క్రేజీ పనులు చేస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను చూసేందుకు, కలిసేందుకు ప్రజలు గంటల తరబడి వేచి ఉంటారు. ఇప్పుడు బిగ్ బికి ఉన్న పాపులారిటీకి అలాంటి ఉదాహరణ అమెరికాలో కనిపించింది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వాస్తవానికి, న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కుటుంబం తమ ఇంట్లో బాలీవుడ్ షాహెన్‌షా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. విగ్రహావిష్కరణని ఇంటిల్లిపాది ఒక గొప్ప వేడుకగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను గోపిసేత్​ తన సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు.

అమితాబ్ విగ్రహాన్ని ఓ పెద్ద గాజు బాక్స్‌లో ఉంచారు. బిగ్‌బీ విగ్రహ ఆవిష్కరణ వేడుక సందర్భంగా సుమారు 600 మంది అభిమానులు హాజరయ్యారు. ఇండియన్‌ సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ అసోసియేషన్స్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ ఆధర్యంలో టపాకులు కాలుస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ హంగామా సృష్టించారు. ఇందులో నాయకుడు ఆల్బర్ట్ జసాని కూడా పాల్గొన్నారు. ఈ విగ్రహంలో అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ మోడ్‌లో కూర్చొని కనిపించారు. ఈ విగ్రహాన్ని పెద్ద గాజు పెట్టెలో ఉంచారు. రాజస్థాన్‌లో డిజైన్ చేయబడిన ఈ విగ్రహం ఖరీదు US $ 75,000, అంటే భారత కరెన్సీలో రూ. 60 లక్షల కంటే ఎక్కువ.

ఇవి కూడా చదవండి

ఈ విగ్రహం గురించి బిగ్‌బికి కూడా తెలుసు..1991లో న్యూజెర్సీలో జరిగిన నవరాత్రి ఉత్సవంలో గోపీ సేథ్ మొదటిసారిగా అమితాబ్ బచ్చన్‌ను కలిశాడు. అప్పటి నుండి అతను బిగ్‌బీకి పెద్ద అభిమానిగా మారానని చెప్పారు. నాకు నా భార్యకు ఆయన దేవుడు లాంటి వారు. రీల్​లైఫ్​లోనే కాదు రియల్​ లైఫ్​లోనూ ఆయన మాట్లాడే విధానం, ఉండే విధానం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది అన్నారు గోపీ సేథ్‌. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే మనిషి. తన అభిమానుల సంక్షేమాలు చూసుకుంటారు. మిగతా స్టార్స్​లా కాదు ఆయన. ఎంతో ప్రత్యేకం. అందుకే నా ఇంటిముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం” అని గోపీ సేథ్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్