Bigg Boss 6 Telugu: కంటెస్టెంట్ల ఎంపిక నుంచి నామినేషన్ల వరకు.. బిగ్‌బాస్‌ షోలో ట్విస్టులే ట్విస్టులు..

తెలుగు బిగ్‌బాస్‌ షో 6వ సీజన్‌ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హౌస్‌‌లోకి ఎంట్రీ ఇచ్చే దగ్గర నుంచి లోపల వరకు ఏర్పాటు చేసే సౌకర్యాల వరకు ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారంట.

Bigg Boss 6 Telugu: కంటెస్టెంట్ల ఎంపిక నుంచి నామినేషన్ల వరకు.. బిగ్‌బాస్‌ షోలో ట్విస్టులే ట్విస్టులు..
Bigg Boss 6
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2022 | 4:01 PM

Bigg Boss 6 Telugu: చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ అంటే ఇష్టపడుతుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అర్థం చెబుతూ, ప్రతీ సీజన్‌కు ప్రేక్షకులకు ఆదరణ అంతకంతకు పెంచుకుంటూ దూసుకపోతోంది. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రస్తుతం భారత దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విస్తరించిందంటేనే.. ఈ షోకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు విషయంలోనూ బిగ్‌బాస్‌ రికార్డులు మాములుగా లేవు. కొత్త సీజన్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు వ్యూవర్ షిప్‌లో తన సత్తా చాటుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 5 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్.. ఇప్పుడు ఆరో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే షో నిర్వహకులు ప్రోమో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ తెలుగు 6వ సీజన్‌ సెప్టెంబర్‌ 4న సాయంత్రం ఆరు గంటలకు మొదలుకానుంది.

ఏర్పాట్లలో జాగ్రత్తలు..

తెలుగు బిగ్‌బాస్‌ షో 6వ సీజన్‌ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హౌస్‌‌లోకి ఎంట్రీ ఇచ్చే దగ్గర నుంచి లోపల వరకు ఏర్పాటు చేసే సౌకర్యాల వరకు ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారంట. ఇక కంటెస్టెంట్ల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. ఎంపిక చేయడం నుంచి ఎలిమినేషన్స్‌ వరకు పక్కగా ప్లాన్ చేస్తున్నారంట. అయితే, ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొనే వారి లిస్ట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కంటెస్టెంట్లు వీరే..

ఇందులో ఈసారి ఆర్య సినిమాలో ఐటం సాంగ్‌తో ఆకట్టుకున్న అభినయ శ్రీ, రాంగోపాల్ వర్మ బ్యూటీ ఇనయ సుల్తానా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నువ్వు నాకు నచ్చావ్‌ ఫేమ్‌ పింకీ (సుదీప), నటుడు బాలాదిత్య, జబర్దస్త్‌ కమెడియన్లు చలాకీ చంటి, ఫైమా, గలాటా గీతూ, సింగర్‌ రేవంత్‌, యూట్యూబర్‌ ఆదిరెడ్డి, వాసంతి కృష్ణన్‌, నటుడు శ్రీహాన్‌, తన్మయ్‌, శ్రీసత్య, యాంకర్‌ ఆరోహి రావు, బుల్లితెర జోడీ రోహిత్‌ – మెరీనా అబ్రహం, అర్జున్‌ కల్యాణ్‌, కామన్‌ మ్యాన్‌ రాజశేఖర్‌, దీపిక పిల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీరిలో ఎంతమంది ఫైనల్ అవుతారో చూడాల్సిఉంది.

నామినేషన్స్‌లో మార్పులు..

ఆరవ సీజన్‌లో మేకర్స్‌ చాలా మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నామినేషన్స్‌‌లో తొలిమార్పు కనిపిస్తోందంట. అందుకు కారణం కూడా ఉందంట. సాధారణ రోజుల్లో వ్యూవర్ షిప్ భారీగా తగ్గిపోయిందంట. వ్యూవర్ షిప్ పెంచేందుకు టాస్క్‌ను ఇకపై బుధవారం షురు చేయనున్నట్లు తెలుస్తోంది.