Mahabubabad: పాపం ఈ పెద్దాయన ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి

మహబూబాబాద్ జిల్లా వేంనూర్ శివారు ఇందిరానగర్​ తండాకు చెందిన రెడ్యా అనే కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Mahabubabad: పాపం ఈ పెద్దాయన ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి
Rat Bites Currency
Follow us

|

Updated on: Jul 17, 2021 | 1:29 PM

కష్టపడి సంపాదించింది రూపాయి అయినా సరే.. అది పోతే ఆ బాధ మాములుగా ఉండదు. అలాంటి రెక్కల కష్టం చేసి.. చెమటపెట్టి సంపాదించిన 2 లక్షల నగదు పనికిరాకుండా పోతే.. ఆ వేదన వర్ణణాతీతం. పాపం తాజాగా ఓ వృద్దుడిని అలాంటి దరిద్రమే వెంటాడింది. మహబూబాబాద్ జిల్లా వేంనూర్ శివారు ఇందిరానగర్​ తండాకు చెందిన రెడ్యా అనే కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత 4 ఏళ్లుగా ఆయన్ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు చూయించుకుంటే.. కడుపులో కణతి ఉందని.. హైదరాబాద్​కు వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. సర్జరీకి దాదాపు 4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అంత డబ్బు రెడ్యా వద్ద లేదు. దీంతో ఖర్చులను పూర్తిగా తగ్గించుకోని.. రూపాయి, రూపాయి కూడబెడుతూ వస్తున్నాడు. కడుపులో నొప్పి వెంటాడుతున్నా, బాధ భరిస్తూనే కూరగాయలు అమ్ముతున్నాడు. అప్పు తీసుకొచ్చిన నగదు.. తన వద్ద ఉన్న డబ్బు మొత్తం కలిపి రూ.2 లక్షలు తన ఇంట్లోని బీరువాలో దాచి ఉంచాడు. ఓ రోజు కడుపు నొప్పి తీవ్రం అవ్వడంతో ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు.

బీరువాలో తాను దాచిన సొమ్ము తీసుకుందామని తెరిచి చూసి ఖంగుతిన్నాడు. కరెన్సీ నోట్లన్ని పిచ్చిపిచ్చిగా చిరిగిపోయి కనిపించాయి.  ఎలా జరిగిందోనని ఆలోచిస్తే.. ఎలుకలు కొట్టాయని అర్థమైంది. చిరిగిపోయిన నోట్లు తీసుకుని కనిపించిన ప్రతి బ్యాంకుకు వెళ్లాడు. ఆ నోట్లు చెల్లవని.. హైదరాబాద్​లోని రిజర్వు బ్యాంక్ శాఖ​కు వెళ్లాలని అధికారులు చెప్పారు. అయితే అక్కడ కూడా చిరిగిపోయిన నగదును తీసుకుంటారో లేరోనని వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.  తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నాడు. ప్రభుత్వం సహకరించి తన ఆపరేషన్‌కు సాయం చెయ్యాలని,  చిరిగిపోయిన నోట్లు తీసుకుని డబ్బు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

Also Read:ఇవి ప్రపంచంలో 5 అత్యంత విషపూరితమైన పాములు.. కాటు వేస్తే అంతే

 మంత్రి హరీష్ రావు రాకతో.. ఆ ఇంట, ఆ ఊరంతా ఆనందం విరిసింది…

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో