AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్ తెలుసా..?

Gold jewelry health benefits: మన పూర్వీకులు బంగారు, వెండి నగలను కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, ఒక రకాల మెడికల్ థెరపీగా కూడా భావించేవారు. ముక్కుపుడక నుంచి కాలి మెట్టెల వరకు మనం ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక సైన్స్ కూడా దాగి ఉంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్ తెలుసా..?
Gold and Silver
Rajashekher G
|

Updated on: Feb 08, 2026 | 4:39 PM

Share

బంగారు, వెండి ఆభరణాలు ధరించడం అనేది మన పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. భారతీయుల పసిడి పట్ల మక్కువ మాత్రం తగ్గడం లేదు. అయితే.. మన పూర్వీకులు నగలను కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, ఒక రకాల మెడికల్ థెరపీగా కూడా భావించేవారు. ముక్కుపుడక నుంచి కాలి మెట్టెల వరకు మనం ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక సైన్స్ కూడా దాగి ఉంది.

భారత సంప్రదాయంలో 36 రకాల ఆభరణాలు ప్రసిద్ధి చెందాయి. ఇవి శరీరంలోని ముఖ్య ఆక్యుప్రెషర్ పాయింట్లను ఉద్దీపన చేయడం ద్వారా ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే, లోహాల థర్మల్ ప్రాపర్టీస్ శరీర ఉష్ణోగ్రతను క్రమపరచడంలో సహాయపడతాయి.

లోహాల విశేషాలు

బంగారం (Gold):

వెచ్చని లోహం. రక్త ప్రసరణను మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చల్లని వాతావరణంలో శరీర వేడిని నిలుపుకోవడానికి బంగారం అద్భుతంగా పనిచేస్తుంది.

వెండి (Silver):

వెండి చల్లని లోహం. అధిక వేడిని తగ్గించడానికి, మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే మన దేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వెండి ఆభరణాలకు ప్రాధాన్యత ఎక్కువ.

రాగి (Copper):

శరీరంలోని ఎలెక్ట్రో-మ్యాగ్నెటిక్ సౌలభ్యాన్ని సమతుల్యం చేస్తుంది. కీళ్ల నొప్పులు, రక్తపోటు నియంత్రణలో రాగి ఉపయోగకరంగా ఉంటుంది.

ఆభరణాలు, ఆక్యుప్రెషర్ ప్రయోజనాలు

మన శరీరంలోని కొన్ని నరాల చివరలు నిర్దిష్ట పాయింట్లలో కేంద్రీకృతమై ఉంటాయి. ఆభరణాలు వాటిని సౌమ్యంగా స్టిమ్యులేట్ చేస్తాయి.

ముక్కుపుడక:

ముక్కుపైని నరాలను ఉద్దీపన చేస్తూ శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడటమే కాక, మహిళల్లో నెలసరి సమస్యలు, ప్రసవ నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది.

చెవి రింగులు:

చెవి లోబ్స్ పాయింట్లు కంటి చూపు మెరుగుదల, మెదడు చురుగ్గా పనిచేయడంలో తోడ్పడతాయి.

కాలి మెట్టెలు:

బొటనవేలి పక్కన వేళ్లకు వెండి మెట్టెలు ధరించడం ద్వారా ఆ నరం గర్భాశయం నుంచి గుండె వరకు అనుసంధానమవుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడమే కాక, మహిళల హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. మన పూర్వీకులు వాతావరణాన్ని బట్టి లోహాలను సౌమ్యంగా ఎంచుకునేవారు. నడుము పైన బంగారం, పాదాలకు వెండి ధరించడం ఇలా ఒక పరంపరగా ఏర్పడింది. బంగారం శరీరంలోని విద్యుత్ శక్తిని సమతుల్యం చేస్తే, వెండి భూమి నుంచి వచ్చే సానుకూల శక్తిని అందిస్తుంది. అంటే, మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ కేవలం అందం కోసం మాత్రమే కాదు.. ఇది మీ శరీర ఆరోగ్యానికి కూడా అని చెప్పవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం కొంత మత సంబంధమైన అంశాలతో ముడిపడి ఉన్నది. ఇతరల వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!