AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

క్యాన్సర్.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనే భయం ఉండేది. కానీ వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. చికిత్స కంటే నివారణ మిన్న అనే నినాదం ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 38 శాతానికి పైగా మనం చేసే చిన్న చిన్న జీవనశైలి మార్పులతోనే నివారించవచ్చు.

క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
వ్యాధి గురించి అవగాహన కల్పించడం, సరైన సమయంలో దానిని గుర్తించడం, నివారణ చర్యల గురించి తెలుసుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం. క్యాన్సర్ మహమ్మారికి నిర్దిష్ట కారణం లేకపోయినప్పటికీ మారుతున్న జీవనశైలి, ఆహారం దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Krishna S
|

Updated on: Feb 08, 2026 | 4:29 PM

Share

క్యాన్సర్ అనగానే భయపడే రోజులకు కాలం చెల్లింది. మనం చేసే కొన్ని చిన్న చిన్న జీవనశైలి మార్పులు, పర్యావరణ మెరుగుదల ద్వారా ఏకంగా 38 శాతానికి పైగా క్యాన్సర్ కేసులను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నివేదికను విడుదల చేసింది. నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. పరిశోధకులు 2022 నుండి నమోదైన సుమారు 19 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులను లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో వ్యక్తులు, ప్రభుత్వాలు నియంత్రించగలిగే 30 నిర్దిష్ట ప్రమాద కారకాలను వారు గుర్తించారు. వీటిని సరిదిద్దుకుంటే ఊపిరితిత్తులు, కడుపు, గర్భాశయ క్యాన్సర్ల బారి నుండి సులభంగా బయటపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

క్యాన్సర్ కారకాల్లో ప్రధానమైనవి ఇవే:

పొగాకు – ధూమపానం

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 15శాతం కేవలం ధూమపానం వల్లే సంభవిస్తున్నాయి. కొత్తగా నిర్ధారణ అవుతున్న కేసుల్లో 23శాతం పొగాకు వాడకంతో ముడిపడి ఉండటం గమనార్హం. ధూమపానానికి దూరంగా ఉండటమే క్యాన్సర్ నివారణకు మొదటి మెట్టు.

మద్యపానం – రెండో అతిపెద్ద శత్రువు

మద్యం సేవించడం వల్ల ఏడాదికి సుమారు 7 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కేసుల్లో ఇది 3.2 శాతానికి సమానం. ధూమపానం, మద్యం రెండింటినీ మానేస్తే క్యాన్సర్ ముప్పు భారీగా తగ్గుతుంది.

గాలి కాలుష్యం – వాయు నాణ్యత

పర్యావరణ మార్పులు కూడా క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు ఆసియా వంటి ప్రాంతాలలో మహిళల్లో నమోదవుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో 15శాతం గాలి నాణ్యత లోపించడం వల్లే వస్తున్నాయని పరిశోధనలో తేలింది.

ఊబకాయం – శారీరక శ్రమ

అధిక శరీర ద్రవ్యరాశి సూచిక, సరైన వ్యాయామం లేకపోవడం, ఎండలోని అతినీలలోహిత వికిరణానికి ఎక్కువగా గురికావడం వల్ల కూడా వివిధ రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది.

నివారణే మార్గం..

క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో కేవలం చికిత్స మాత్రమే కాదు నివారణ అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ మహమ్మారిని దరిచేరకుండా చూసుకోవచ్చు

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?