AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : కలర్, అందాన్ని బట్టి రేటు.. నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు!

గుట్టు చప్పుడుకాకుండా నగరంలో అక్రమంగా చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు జరుపుతున్న చైల్‌ ట్రాఫికింగ్‌ ముఠాకు పోలీసులు చెక్‌పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను తెచ్చిన నగరంలో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కలర్, జెండర్‌ను భట్టి చిన్నారులను రూ.7-10 లక్షల మధ్య విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటననపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad : కలర్, అందాన్ని బట్టి రేటు.. నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు!
Hyderabad Child Trafficking
Anand T
|

Updated on: Feb 08, 2026 | 4:19 PM

Share

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చిన్నారులను ఎత్తుకొచ్చి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న చైల్డ్‌ ట్రాఫికింగ్ ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్‌ పెట్టారు. ఈ ముఠా చిన్నారుల విక్రయాల కోసం గుజరాత్, హైదరాబాద్‌లో నగరంలో భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు గుజరాత్‌ నుంచి చిన్నారులను కొనుగోలు చేసి వారిని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. అయితే ఇటీవల ఓ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్‌ పోలీసులు నలుగురు ఏజెంట్‌లు పట్టుబడగా.. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.

అటు గుజరాత్, ఇటు హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న ఈ ముఠా గడిచిన రెండేళ్లలో సుమారు 25 మంది చిన్నారులను హైదరాబాద్‌లో విక్రయించినట్టు పోలీసులు కనుగొన్నారు. పిల్లలు లేని వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఈ ముఠా స్థానికంగా ఉన్న ఐవీఎఫ్‌ సెంటర్లతో చేతులు కలిపి ఈ దందాను కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గుజరాత్‌లో అక్రమంగా జన్మించిన చిన్నారులను హైదరాబాద్‌కు తరలించి.. ఇక్కడ ఉన్న ఏవీఎఫ్‌ సెంటర్ల ద్వారా పిల్లలు లేని దంపతులకు చిన్నారులను తక్కువ రేట్లకు విక్రయించి సొమ్మ చేసుకుంటున్నారు.

పిల్లలకు రేట్లు ఎలా నిర్ణఇస్తారు?

ఈ ముఠా పిల్లల రంగు, జెండర్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నట్టు పోలీసలు గుర్తించారు. చిన్నారులు కొద్దిగా ఫెయిర్‌గా ఉంటే రూ.7లక్సలు, తక్కువ కలర్ ఉంటే రూ.4లక్షలు, ఆడపిల్లలు అయితే రూ.5 నుంచి 10 లక్షలు, అదే మగపిల్లలకు రూ.10 నుంచి 15 లక్షల వరకు వీరు ధరలు నిర్ణయించి విక్రయించే వారట. అయితే ఈ ముఠాలో ఉన్న చాలా మంది ఇంతకు ముందు ఐపీవీఎఫ్‌ సెంటర్లలో పనిచేసినవారేనని పోలీసులు గుర్తించారు.

అయితే ముఠా సభ్యులు ఎక్కువగా ఐవీఎఫ్‌ సెంటర్లలో పనిచేసిన వారే కావడంతో పోలీసులు ప్రస్తుతం నగరంలో ఐవీఎఫ్ సెంటర్లపై నిఘా పెంచారు. పిల్లలు లేని దంపతులు అనాదాశ్రమం, లేదా చట్టబద్దంగా పిల్లలను దత్తత తీసుకోవాలని, ఇలా ఐవీఎఫ్‌ సెంటర్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమని.. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా చిన్నారులను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!