AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోషకాల పవర్‌హౌస్.. దీని సీక్రెట్స్ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.. ఆకు కూరల్లో ది బెస్ట్ ఇదే..

ఆకుకూరలలో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. పాలకూర రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందిస్తుంది. ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు, పొటాషియం వంటి పది ముఖ్యమైన పోషకాలకు ఇది నెలవు.. పాలకూర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. రక్తహీనతను నివారిస్తుంది.

పోషకాల పవర్‌హౌస్.. దీని సీక్రెట్స్ తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.. ఆకు కూరల్లో ది బెస్ట్ ఇదే..
ముఖ్యంగా ఖాళీ కడుపుతో పాలకూర రసం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది షుగర్‌, బీపీ వంటి అనేక దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలను శాశ్వతంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. పాలకూర చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది.
Shaik Madar Saheb
|

Updated on: Feb 08, 2026 | 4:12 PM

Share

ఆరోగ్యకరమైన ఆహారంలో ఆకుకూరలకు విశిష్టమైన స్థానం ఉంది. అయితే, వాటిలో పాలకూరది ప్రత్యేకమైన స్థానం. ఇది రుచిగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తుంది. అందుకే.. పాలకూరను ఒక దివ్యమైన ఆహార ఔషధంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, ఖనిజాలకు నిలయం.. పాలకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు దాగున్నాయి.. పాలకూర అందించే అద్భుతమైన పది ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూర టాప్ 10 ప్రయోజనాలు..

  1. ఐరన్ (ఇనుము): ఈ రోజుల్లో చిన్న, పెద్ద అందరిలోనూ ఐరన్ లోపం సాధారణమైపోయింది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అత్యంత కీలకం. 100 గ్రాముల పాలకూరలో 2.7 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది, ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
  2. కాల్షియం: ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం అత్యవసరం. ముఖ్యంగా మహిళలకు, పెరిగే పిల్లలకు, వృద్ధులకు ఇది చాలా ముఖ్యం. 100 గ్రాముల పాలకూర ద్వారా 99 మైక్రోగ్రాముల కాల్షియం అందుతుంది. గర్భస్థ శిశువుల ఎముకల పెరుగుదలకు కూడా ఇది అవసరం.
  3. ఫైబర్ (పీచుపదార్థం): జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో అవసరం. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.. గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తుంది. పాలకూరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. 100 గ్రాముల పాలకూరలో 2.2 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
  4. పొటాషియం: శరీరంలోని అనేక జీవక్రియలు సక్రమంగా జరగడానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, కండరాల నొప్పులను నివారించడంలో, గుండె జబ్బుల నివారణలో ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ దశలోని మహిళలకు ఇది చాలా అవసరం. 100 గ్రాముల పాలకూరలో 558 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది.
  5. ఫోలేట్: సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి, గర్భిణీలకు ఫోలేట్ చాలా అవసరం. గర్భస్థ పిండం ఎదుగుదలకు, అభివృద్ధికి ఇది కీలక పోషకం. శిశువు మెదడు, వెన్నుముక సరైన అభివృద్ధికి ఫోలేట్ ప్రధానం. 100 గ్రాముల పాలకూరలో 165 మైక్రోగ్రాముల ఫోలేట్ ఉంటుంది.
  6. విటమిన్ ఎ: కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మెరిపించడంలో, జుట్టు పెరుగుదలకు విటమిన్ ఎ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల పాలకూర ద్వారా 141 మైక్రోగ్రాముల విటమిన్ ఎ లభిస్తుంది.
  7. విటమిన్ సి: ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక శక్తిని పెంచి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి పూర్తి ప్రయోజనం పొందాలంటే పాలకూరను ఎక్కువ సేపు ఉడికించకూడదు. 100 గ్రాముల పాలకూరలో 28.1 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
  8. విటమిన్ కె: వెన్నునొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలను నివారించడంలో విటమిన్ కె ప్రధాన పాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల పాలకూరలో 482.9 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది.
  9. సోడియం: కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు సోడియం అవసరం. శరీరంలో సోడియం తక్కువగా ఉంటే తలనొప్పి, కండరాల బలహీనత వంటివి వస్తాయి. 100 గ్రాముల పాలకూరలో 79 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది.
  10. మెగ్నీషియం: హార్మోన్ల నియంత్రణ, ఎముకల ఆరోగ్యం, కాల్షియం శోషణ వంటి వాటికి మెగ్నీషియం అవసరం. 100 గ్రాముల పాలకూరలో 79 మైక్రోగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.

ఇలా పాలకూర ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ కంటే గొప్పగా పనిచేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాల్లో రాళ్లు) వచ్చే అవకాశం ఉన్నవారు పాలకూర వినియోగాన్ని తగ్గించుకోవాలి. మిగతా అందరూ తమ ఆహారంలో పాలకూరను చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us