AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android Smartphone: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు.. వెంటనే జాగ్రత్త పడండి

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడేవారికి కీలక అలర్ట్ జారీ చేసింది. ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే తక్కువ వెర్షన్లను వాడుతున్నవారికి హెచ్చరిక జారీ చేసింది. ఈ వెర్షన్ ఫోన్లకు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను నిలిపివేసింది.

Android Smartphone: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు.. వెంటనే జాగ్రత్త పడండి
Smartphones
Venkatrao Lella
|

Updated on: Feb 08, 2026 | 4:26 PM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నవారిలో ఎక్కువమంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్నారు. ఐఓఎస్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించేందుకు ఆసక్తిచూపేవారే ఎక్కువమంది ఉన్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఎక్కువగా ఆండ్రాయిడ్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోట్ల సంఖ్యలో ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్నారు. అయితే ఆండ్రాయిడ్ వెర్షన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త అప్‌డేటెడ్ వెర్షన్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు టెక్ దిగ్గజం గూగుల్ బిగ్ షాకిచ్చింది. ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాత వెర్షన్లపై పని చేస్తున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు భారీ షాకిచ్చింది. ఆ వెర్షన్లకు ఇక నుంచి సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు ఆపివేస్తున్నట్లు వెల్లడించింది.

కేవలం 58 శాతం మందే కొత్త వెర్షన్లు

స్మార్ట్‌ఫోన్ యూజర్లలో కేవలం 58 శాతం మంది మాత్రమే ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే ఎక్కువ అప్‌గ్రేడ్ వెర్షన్లు వాడుతున్నారు. ఇక ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్లు కేవలం 7.5 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 నుంచి 16 వెర్షన్లు వరకు ఉన్న ఫోన్లలో సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ 9 లేదా అంతకంటే పాత వెర్షన్ల నుంచి ఆండ్రాయిడ్ 12 వరకు వాడుతున్న వారికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్‌లు ఆగిపోనున్నాయి. దీంతో ఈ వెర్షన్ల ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నవారు సైబర్ దాడులు, మాల్వ్‌వేర్ దాడుల బారిన పడవచ్చు.

ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే..?

-హ్యాకింగ్ ముప్పు బారిన పడవచ్చు

-యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ చోరీ కావొచ్చు

-ఓటీపీ మెస్సేజ్‌లను ట్రాక్ చేయడం

-బ్యాంకింగ్, ట్రేడింగ్ యాప్స్ హ్యాక్ చేయొచ్చు

-మీ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు మాయం కావొచ్చు

ఎలా చెక్ చేసుకోవాలి

-మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి

-ఎబౌట్ ఫోన్ ఆప్షన్‌ను ఎంచుకోండి

-ఆండ్రాయిడ్ వెర్షన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాత వెర్షన్ అయితే మీ ఫోన్‌ను మార్చుకోవడం మంచిదిి

ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయండి

Follow Us
కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే
కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..