Telangana: అన్నదాతపై కన్నెర్రజేసిన ప్రకృతి.. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలకు భారీ నష్టం..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట, కదంబపూర్, సుద్దాల గ్రామాల్లో వడగండ్ల వర్షాలకు భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రకృతి అన్నదాతపై కన్నెర్ర జేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో వడగండ్ల వానలకు పంటలు తీవ్ర నష్టం జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు వడగళ్ల వానకు వరి పంట నేలకొరిగింది. మామిడి పూత, మిర్చి పంట .. నేల రాలింది. అకాల వర్షాలు, వడగళ్ల వానతో మహబూబాబాద్, జనగాం, వరంగల్ జిల్లాల్లో 82,359 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, పత్తి, మిర్చి, కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట, కదంబపూర్, సుద్దాల గ్రామాల్లో వడగండ్ల వర్షాలకు భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వానలకు సుల్తానాబాద్ ఎలిగేడు,ఓదెల, మండలాల్లో చేతికి అందచే వరి పంట వడ్లు నేలరాలి రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మామిడి, మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
REPORTER: SAMPATH
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..