TSPSC: పేపర్ లీకేజ్ కేసులో మొదలైన చర్యలు.. రేణుకతో పాటు ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల వ్యవహారంలో రోజురోజుకీ పరిణామాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ప్రధాన నింధితులైన రాజశేఖర్..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల వ్యవహారంలో రోజురోజుకీ పరిణామాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ప్రధాన నింధితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుకను విడివిడిగా విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజశేఖర్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి కాగా.. అతను కంప్యూటర్ల పాస్‌వర్డులు తెలుసుకుని.. అందులోని ప్రశ్నాపత్రాలను కాపీ చేసి ప్రవీణ్‌కు ఇచ్చేవాడు. వాటిని ప్రవీణ్ తీసుకుని రేణుకకిచ్చి.. తన దగ్గర పేపర్లు ఉన్నాయని అభ్యర్థులను ఆకర్షించి డీల్ మాట్లాడాలని సూచించేవాడు. ఇలా వీరి దందా నడిచినట్లు తేలింది.
ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రేణుక పాత్ర ప్రధానంగా ఉందని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే రేణుకతో పాటు భర్త డాక్యా నాయక్‌లను అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. రేణుక వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్‌కి స్కూల్ ప్రిన్సిపల్ నివేదిక పంపడంతో రేణుక ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రేణు భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడిఓ ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అధికారులు ఆయనను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకుముందు పలుసార్లు విఫలం..
ఇదిలా ఉంటే సిట్ టీమ్ కస్టడిలో ఉన్న నిందితుల నుంచి అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలను తస్కరించేందుకు పరీక్షకు మూడు నెలల ముందు నాలుగుసార్లు విఫలయత్నం చేశాడు. ఐదోసారి ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక రాజశేఖర్, ప్రవీణ్‌లు ఎవరెవరికీ పేపర్లు అమ్ముకున్నారు. వచ్చిన సొమ్మును ఏం చేశారన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..