AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ఇవాళ మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. ఈ అంశాలపైనే అధికారుల ఫోకస్..

ఇవాళ మరోసారి ఈడీ ముందు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సమయంలో ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ధ్వంసం చేశారన్న ఫోన్లను మీడియాకు చూపించే చాన్స్ ఉంది.

MLC Kavitha: ఇవాళ మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. ఈ అంశాలపైనే అధికారుల ఫోకస్..
MLC Kavitha
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 21, 2023 | 11:40 AM

Share

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు  విచారించనున్నారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సమయంలో ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ధ్వంసం చేశారన్న ఫోన్లను మీడియాకు చూపించే చాన్స్ ఉంది. సోమవారం విచారణ వివరాలనూ మీడియాకు కవిత చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకూ విచారణ చేశారు. దాదాపు 11 గంటలపాటు ఈడీ విచారణ కొనసాగింది.

ఎమ్మెల్సీ కవితను 14 ప్రశ్నలు అడిగారు ఈడీ అధికారులు. అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అరుణ్‌ పిళ్లైతో కవిత ముఖాముఖీ విచారణ జరగలేదని సమాచారం. కవిత, పిళ్లైని విడివిడిగానే విచారించినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత బయటకొచ్చిన కవిత అభిమానులకు విజయచిహ్నం చూపిస్తూ , చిరునవ్వు చిందించారు. అభిమానులు ఆమెకు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఆ తర్వాత ఢిల్లీలోని సీఎం కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు. ఇవాళ ఉదయం 11:30కి విచారణకు రావాలని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.

సోమవారం కవిత ఈడీ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కవిత వెళ్లిన గంట తర్వాత కూడా ఈడీ బృందం ఏ ప్రశ్నలు అడగలేదని సమాచారం. కుట్ర పూరితంగానే తనను ఇరికించారని, తానూ ఎలాంటి తప్పు చేయలేదని, ఇది రాజకీయకుట్ర అని ఆమె ఈడీ అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా, రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని ఈడీతో కవిత అన్నట్లు సమాచారం.

అంతేకాదు రాజకీయ ఒత్తిడిలో భాగంగానే తనను విచారిస్తున్నారా? లేక నిందితురాలిగా పిలిచారా అని ఈడీని కవిత అడిగినట్లు సమాచారం. ఐతే అనుమాతురాలిగా పిలిచామని ఈడీ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పొలిటికల్‌ లైన్‌లో తనను ప్రశ్నలు అడగొద్దని కవిత కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత ఈడీకి చెప్పినట్లు సమాచారం.

ఈనెల 24న తన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ఉందని కవిత ఈడీ అధికారులకు సూచించారు. అంతవరకూ విచారణ ఆపాలని ఆమె కోరినట్లు సమాచారం. అంతేకాదు ఈడీ విచారణలో పారదర్శకత లేదని, ఇష్టానుసారం మీడియాకు లీకులు ఎందుకు ఇస్తున్నారని ఈడీతో కవిత అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ దూకుడు పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..