AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండుసార్లు ఆసియా కప్ గెలిచినా ఎవరూ గుర్తించలేదు.. రవిశాస్త్రీ సంచలన వ్యాఖ్యలు

గత కొన్నేళ్లుగా టీమ్ఇండియా ఎంతోమంది ఉత్తమమైన హెడ్ కోచ్ లను చూసింది. రెండేళ్ల క్రితం రవి శాస్త్రీ, రాహుల్ ద్రావిడ్ లు టీమ్ బాధ్యతలు స్వీకరించడం చూశాం.

రెండుసార్లు ఆసియా కప్ గెలిచినా ఎవరూ గుర్తించలేదు.. రవిశాస్త్రీ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri
Aravind B
|

Updated on: Mar 21, 2023 | 7:20 AM

Share

గత కొన్నేళ్లుగా టీమ్ఇండియా ఎంతోమంది ఉత్తమమైన హెడ్ కోచ్ లను చూసింది. రెండేళ్ల క్రితం రవి శాస్త్రీ, రాహుల్ ద్రావిడ్ లు టీమ్ బాధ్యతలు స్వీకరించడం చూశాం. రాహుల్ ద్రావిడ్ ముందు రవిశాస్త్రీ 2021 నవంబర్ వరకు దాదాపు నాలుగున్నరేళ్ల పాటు కోచ్ గా ఉన్నాడు. భారత జట్టుకు ట్రోపీలు వచ్చే అంశంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ పదవి కాలంపై రవి శాస్త్రీ కొన్ని కొన్ని విషయాలు పంచుకున్నారు. తను నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేయడం, ఇండియా -ఏ టీమ్ తో కొన్నేళ్లుగా ఉన్న అనుభవం ఉన్నందున రాహుల్ కు మరిన్ని టీమ్ లను ఇవ్వాలని అభినమానులను కోరారు. తనకు ట్రోపిలు గెలిచేందుకు సమయం పట్టిందని..రాహుల్ కు కూడా ఎన్సీఏ, ఇండియా ఏ టీమ్ తో పని చేసిన అనుభవం ఉన్నందున్న అతనికి కూడా సమయం పడుతుందని తెలిపారు. అలాగే ఇండియాకి ట్రోఫీలు లేకపోవడంపై మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను కోచ్ గా ఉన్నప్పుడు 20216, 2108 లో రెండు సార్లు టీమ్ ఇండియా ఆసియా కప్ గెలిచిందని పేర్కొన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ గుర్తుండదని వాపోయారు. పెద్ద టోర్నమెంట్ లు గెలవాలంటే అదృష్టం ఉండాలని.. అలాగే జట్టు సభ్యులు ముందుకెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు.

ప్రతిఒక్కరు ఇండియా గెలవాలని కోరుకుంటారు. కాని తాను కోచ్ గా ఉన్నప్పుడు రెండు సార్లు ఆసియా కప్ గెలిస్తే ఎవరూ పట్టించుకోలేదని..ఒడిపోయనప్పుడు మాత్రం ఆ విషయంపై ఎత్తిచూపారని రవి శాస్త్రీ అన్నారు. అందుకే మన కృషి ఎప్పటికీ ఉండాలని తెలిపారు. కొన్నిసార్లు సరిగ్గా ఆడకపోయిన గెలిచే సందర్భాలు ఉంటాయని.. కొన్నిజట్లు కూడా సరిగ్గా ఆడకపోయిన చాలా అరుదుగా వరల్డ్ కప్ ను కూడా గెలుస్తాయని తెలిపారు. ఇదిలా ఉండగా రాహుల్ ద్రావిడ్ టీమ్ ఇండియా కేప్టెన్ గా 2023 చివరి వరకు ఉండనున్నారు. రాహుల్ పదవి కాలంలో భారత జట్టు 50 ఓవర్ల వరల్డ్ కప్, ఆసియా కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఇలా మూడు కీలకమైన మ్యాచ్ లు ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..