Time Travel: కాలంతో ప్రయాణించి 2714 సంవత్సారానికి వెళ్లిన వ్యక్తి.. భవిష్యత్ ప్రపంచంపై షాకింగ్ విషయాలు?

Human On Mars: కాలంతో ప్రయాణించి 2714 సంవత్సరం నుంచి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. తదుపరి ప్రపంచ మహమ్మారితో సహా రాబోయే దశాబ్దంలో జరిగే సంఘటనల గురించి ఓ హెచ్చరికను జారీ చేశాడు. ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తుంది, వైరస్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా అతను చెప్పడం గమనార్హం.

Time Travel: కాలంతో ప్రయాణించి 2714 సంవత్సారానికి వెళ్లిన వ్యక్తి.. భవిష్యత్ ప్రపంచంపై షాకింగ్ విషయాలు?
Human On Mars
Follow us

|

Updated on: Mar 21, 2023 | 5:48 AM

Human On Mars: 2020 సంవత్సరంలో వచ్చిన కరోనా మహమ్మారి ఇప్పటి వరకు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వైరస్ లక్షలాది మంది ప్రాణాలను తన పొట్టన పెట్టుకుంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, దాని రెండవ తరంగం ప్రపంచవ్యాప్తంగా మరింత వినాశనానికి కారణమైంది. ఇదిలా ఉంటే టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి చేసిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను భవిష్యత్తును చూశానని, రాబోయే సంవత్సరాల్లో, మరొక భయంకరమైన అంటువ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కరోనా వంటి బాధితులను చేస్తుందని అతను చెప్పుకొచ్చాడు.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం, ఆ వ్యక్తి తాను కాలంతో ప్రయాణించి 2714 సంవత్సరం నుంచి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. తదుపరి ప్రపంచ మహమ్మారితో సహా రాబోయే దశాబ్దంలో జరిగే సంఘటనల గురించి ఓ హెచ్చరికను జారీ చేశాడు. ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తుంది, వైరస్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా అతను చెప్పడం గమనార్హం. అతని వాదన ప్రకారం, 2024 సంవత్సరంలో అంటే వచ్చే ఏడాది మంచు కరిగిపోతుంది. దాని కింద పాతిపెట్టిన ప్రమాదకరమైన వైరస్ ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. 35 కోట్ల మందికి పైగా ఈ వైరస్ బారిన పడతారు. ఈ వైరస్ ప్రజలను తీవ్రంగా భయపెడుతుందని చెప్పుకొచ్చాడు.

ఆ వ్యక్తి పేరు ఎనో అలరిక్. సోషల్ మీడియాలో @theradianttimetraveller పేరుతో టిక్‌టాక్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు. ఈ సంవత్సరం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గ్రహాంతరవాసిని శోధిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇది చాలా నక్షత్రాల నుంచి పెద్ద మొత్తంలో శక్తిని గ్రహిస్తుంది. ఆ తర్వాత సూర్యుడిని నుంచి శక్తిని తీసుకుంటుందని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, కొన్ని విచిత్రమైన, షాకింగ్ వాదనలు కూడా వినిపించాడు. 2025లో మానవులు అంగారక గ్రహాన్ని చేరుకుంటారని, అక్కడ వారు చూసే అంశాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని ఆయన తెలిపాడు. వ్యోమగాములు ల్యాండింగ్ సైట్ సమీపంలో మానవ ఎముకలను కనుగొంటారు. ఇది భూమిపై నివసించే మానవులు ఇంతకు ముందు అంగారక గ్రహంపై నివసించినట్లు రుజువు చేస్తుందని షాక్ ఇచ్చాడు. 2026లో చరిత్రలో అతిపెద్ద సౌర తుఫాన్ భూమిని తాకుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరు వారాల పాటు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపాడు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..