Rain Alert: బంగాళాఖాతంలో మరో ఉపరితల ద్రోణి.. హైదరాబాద్‌లో భారీ వర్షం

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ప్రస్తుతానికి తగ్గినప్పటికీ మరో ఉపరితల ద్రోణి ఏర్పడటం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Rain Alert: బంగాళాఖాతంలో మరో ఉపరితల ద్రోణి.. హైదరాబాద్‌లో భారీ వర్షం
Rain Alert
Follow us

|

Updated on: Oct 05, 2022 | 8:47 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ప్రస్తుతానికి తగ్గినప్పటికీ మరో ఉపరితల ద్రోణి ఏర్పడటం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో కురిసిన భారీ వర్షం కారణంగా దుర్గా మల్లేశ్వరుల నదీ విహారం రద్దయ్యింది. 21 ఏళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. నిజానికి నదీలో నీటి ఉధృతి కారణంగా తెప్పోత్సవానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు వర్షం కారణంగా విఫలమయ్యాయి.

అటు వరంగల్‌లో భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవానికి కూడా వర్షం అడ్డంకిగా నిలిచింది. ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించే రావణ వధ కార్యక్రమం వర్షం కారణంగా నిలిచిపోయింది. జగిత్యాలలో దుర్గా దేవి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పూజారి గల్లంతయ్యారు. ఆయన కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం..

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఫలితంగా పాతబస్తీలో లోతట్టు కాలనీలు నీట మునిగాయి. సికిద్రాబాద్, ఎల్బీ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, మలక్ పేట, హిమయత్ నగర్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. అయితే ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అలాగే గురువారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా విజయవాడ కనక దుర్గ అమ్మవారి జలవిహారం రద్దయ్యింది. 21 ఏళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే మొదటి సారి. అటు వరంగల్‌లో భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సంవ కూడా నిలిచిపోయింది. ఇటీవల నుంచి వర్షాలు భారీగా కురుస్తుండటంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నష్టం కూడా తీవ్రంగానే వాటిల్లింది. వర్షాకాలం ముగిసినా.. వర్షాలు ఇంకా జోరుగానే కురుస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో