AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తిరికి టీఆర్ఎస్ పార్టీలోకి..

బుధవారం ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకు వీరు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజుల కిందట ఓదెలు తన భార్య..

TRS: మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తిరికి టీఆర్ఎస్ పార్టీలోకి..
Nallala Odelu
Sanjay Kasula
|

Updated on: Oct 05, 2022 | 12:02 PM

Share

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకు వీరు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజుల కిందట ఓదెలు తన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మితో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరు మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరనున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఓదెలు.. బాల్క సుమన్‌ను ఆత్మీయ అలింగనం చేసుకున్నారు.

ఇక, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన నల్లాల ఓదెలు.. తన రాజకీయ జీవితాన్ని టీఆర్‌ఎస్‌తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన నల్లాల ఓదెలు.. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సమక్షంలో నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ నేతలు మాత్రం నల్లాల ఓదెలు చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. చెన్నూరు కాంగ్రెస్‌లో ఆయన చేరిక తర్వాత కొమ్ములాట మొదలైంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్ వర్గంతో ఓదెలు దంపతులు కోల్డ్ వార్ మొదలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..