AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: పాత బస్తీలో రౌడీ షీటర్‌ దారుణ హత్య..! భయాందోళనలో స్థానికులు..

అర్ధరాత్రి పాతబస్తీ భవానీ పోలీస్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. కుమార్ వాడి ప్రాంతంలో.. రైన్ బజార్‌కి చెందిన రౌడీ సీటర్ సయ్యద్ భక్త్యారాగ అలియాస్ మహ్మద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు..

Hyderabad Crime: పాత బస్తీలో రౌడీ షీటర్‌ దారుణ హత్య..! భయాందోళనలో స్థానికులు..
Rowdy sheeter murder case
Srilakshmi C
|

Updated on: Oct 05, 2022 | 9:31 PM

Share

అర్ధరాత్రి పాతబస్తీ భవానీ పోలీస్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. కుమార్ వాడి ప్రాంతంలో.. రైన్ బజార్‌కి చెందిన రౌడీ సీటర్ సయ్యద్ భక్త్యారాగ అలియాస్ మహ్మద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితికిలోకి వెళ్లాడు. రౌడీషీటర్ మహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు దృవీకరించారు. గత కొంత కాలంగా విదేశాల్లో ఉన్న మహ్మద్‌ తాగా హైదరాబాద్‌కి వచ్చాడు. మరో రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈలోగా ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది.

ఇది పాత కక్షలకు సంబంధించిన హత్యగా భావిస్తున్నారు పోలీసులు. పోలీసులు కూడా రౌడీషీటర్లపై చూసీ చూడకుండా వదిలేస్తున్నారనీ, గట్టి నిఘా ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఈ హత్యకు కారకులెవరు? మృతుడు విదేశాలకు వెళ్లడం వెనక దాగిన కారణాలేమై ఉంటాయ్? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పాతబస్తీలో రాన్రాను.. శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయా? రౌడీషీటర్లపై పోలీసు నిఘా లేక పోవడంతో, హత్యాకాండ నాన్ స్టాప్‌గా నడుస్తోందా? తాజా రౌడీషీటర్ మర్డర్ హత్య వెనక దాగి ఉన్నదెవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.