AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాజకీయాలు జోరందుకున్నాయి. వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటున్నాయి..

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
TPCC President Revanth Reddy
Subhash Goud
|

Updated on: Oct 05, 2022 | 2:39 PM

Share

తెలంగాణ రాజకీయాలు జోరందుకున్నాయి. వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇక సీఎం కేసీఆర్‌ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించడంతో రాజకీయాలు మరింతగా ముదిరాయి. ప్రతిపక్ష నేతలు మాటల యుద్దాలు కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా బలోపేతమయ్యారని, వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు రుణం తీరిపోయింది. తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆరెస్ పార్టీని తీసుకువచ్చాడని, తెలంగాణ అనే పదం ఇక్కడిప్రజల జీవన విధానంలో భాగమని అన్నారు. తెలంగాణ పదాన్ని కేసీఆర్‌ చంపేయాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు. తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలి. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆరెస్ పార్టీని తీసుకువచ్చారని, ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండి.. దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టండి. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటా. తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని,. ఇక తెలంగాణతో కేసీఆర్ కు రుణం తీరిపోయిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి