AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MP Laxman: తెలంగాణలో టీఆర్ఎస్‌కు నూకలు చెల్లినయ్.. అందుకే BRS పేరుతో కొత్త డ్రామా: ఎంపీ లక్ష్మణ్

కేసీఆర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు నూకలు చెల్లాయని.. అందుకే బీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారంటూ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.

BJP MP Laxman: తెలంగాణలో టీఆర్ఎస్‌కు నూకలు చెల్లినయ్.. అందుకే BRS పేరుతో కొత్త డ్రామా: ఎంపీ లక్ష్మణ్
Bjp Mp Laxman
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2022 | 8:38 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దసరాను పురస్కరించుకుని జాతీయ పార్టీ బీఆర్ఎస్‌ను ప్రకటించారు. టీఆర్ఎస్‌ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు నూకలు చెల్లాయని.. అందుకే బీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారంటూ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కేసీఅర్ 8 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటో ముందు చెప్పాలంటూ ప్రశ్నించారు. జాతీయ పత్రికలు, టీవీలకు తెలంగాణ బంగారమయమైందని తప్పుడు ప్రచారం చేస్తూ దేశ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారంటూ మండించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాల్జేసి యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కుదువ పెట్టిన కేసీఆర్.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా? అని ప్రశ్నించారు.

అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే కేసీఆర్ ఆదర్శమా? రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా? ఉద్యోగస్తుల ఉసురు పోసుకుంటున్న 317 జీవోను దేశమంతా విస్తరింపజేస్తారా? గుడి సొమ్ము, బడి సొమ్మును దిగమింగడం.. డిస్కంలను నిండా ముంచడమే దేశానికి ఆదర్శమా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? అంటూ ఎద్దెవా చేశారు.

సన్న బియ్యం నువ్వు తిని దొడ్డు బియ్యం మాతో తినిపియ్యడడం నీ దేశ ఆహార విధానామా అని లక్ష్మన్ ప్రశ్నించారు. బళ్ళో చాక్ పీసులు ఇవ్వకపోవడం, కొన్ని ఏళ్ల నుంచి టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా వుండడం, యూనివర్సిటీ లను నాశనం చేయడం నీ దేశ విద్యా విధానమా.. అన్నారు. భైంసా అల్లర్లను, హైదరాబాద్ లో తీవ్రవాద స్థావరాలను ప్రోషహించడం నీ కొత్త పార్టీ దేశ రక్షణ విధానమా?.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడం చేతగాక తెలంగాణ ఆడబిడ్డల ప్రాణాలు తీయడమే బీఆర్ఎస్ వైద్య విధానమా? పావలా ఖర్చుతో పంటలు పండించే వీలున్న చోట రూపాయి ఖర్చుపెట్టి ప్రాజెక్ట్స్ పేరుతో దోచుకోవడమే బీఆర్ఎస్ నీటిపారుదల విధానమా? అని విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్… రాజకీయ పునరేకీకరణ కానే కాదు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగుల, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే అన్నారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేక తన సొంత సోకుల కోసం ఖర్చు పెట్టడానికి ఆడుతున్న డ్రామాలివి.. అంటూ లక్ష్మణ్ ఆరోపించారు. మునుగోడు ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రజలను మళ్ళించే ఉద్దేశంతో కేసీఆర్ చేస్తున్న విన్యాసాలను ప్రజలకు అర్ధమైందన్నారు. మునుగోడు బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమంటూ లక్ష్మణ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..