Telangana Congress: పొంగులేటితో రాహుల్ జూమ్ మీట్.. వాడీవేడిగా కాంగ్రెస్ పీఏసీ.. జగ్గారెడ్డి గుస్సా..!
Telangana Congress PAC Meeting: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం వాడీవేడిగా జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

Telangana Congress PAC Meeting: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం వాడీవేడిగా జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకాచౌదరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్‌రెడ్డి చేరికపై చర్చ జరిగింది. వారి షరతులతోపాటు.. చేరికలు తదితర విషయాలపై నేతలంతా చర్చించారు. అయితే గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డి సమావేశానికి రాకుండా తొలుత తన ఛాంబర్‌లో కూర్చుండిపోయారు. ఫోటోల కోసం తాను రానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్‌కు ఆయన స్పష్టంచేశారు. చివరకు జగ్గారెడ్డిని బుజ్జగించిన మహేశ్ గౌడ్.. సమావేశానికి వెంట తీసుకెళ్లారు.
రాహుల్ తో జూమ్ మీటింగ్..
ఇదిలాఉంటే.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరికలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పొంగులేటితో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా పొంగులేటి, రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో జూమ్ కాల్ లో మాట్లాడినట్లు పేర్కొంటున్నారు. వీరింతా తాజా రాజకీయ పరిస్థితులు, చేరిక, తదితర అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి వ్యూహకర్తగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నట్లు సమాచారం.
జైలుకు పంపిస్తాం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీ లీకువీరులను జైలుకు పంపిస్తామన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ప్రశ్నాపత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే కేటీఆర్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..