AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Protein Idli: ఒక్క ఇడ్లీలో ఇంత ప్రోటీనా? బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మీల్!

ప్రతిరోజూ తినే రొటీన్ ఇడ్లీలకు స్వస్తి చెప్పే సమయం వచ్చేసింది! మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే డైటీషియన్లు సూచించిన ఈ 'సూపర్ ప్రోటీన్ ఇడ్లీ'ని మీ డైట్‌లో చేర్చుకోండి. శనగలు, మఖానా, కిడ్నీ బీన్స్‌తో తయారయ్యే ఈ ఇడ్లీలు రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పుష్కలంగా అందిస్తాయి. దీని తయారీ విధానం ఏంటో ఇక్కడ చూడండి.

High Protein Idli: ఒక్క ఇడ్లీలో ఇంత ప్రోటీనా? బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మీల్!
High Protein Idli
Bhavani
|

Updated on: Jan 17, 2026 | 6:41 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తక్కువ తినడం సరిపోదు, సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. మనం రెగ్యులర్‌గా తినే రైస్ ఇడ్లీకి బదులుగా, పప్పుధాన్యాలతో చేసిన ఈ హై-ప్రోటీన్ ఇడ్లీ తింటే గంటల తరబడి ఆకలి వేయదు. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ సరికొత్త ఇడ్లీ రెసిపీ విశేషాలు మీకోసం..

కావలసిన పదార్థాలు:

ఒక కప్పు పప్పుల మిశ్రమం (లెంటిల్స్)

అర కప్పు శనగపప్పు

అర కప్పు కిడ్నీ బీన్స్

అర కప్పు మఖానా

ఒక టీస్పూన్ మెంతి గింజలు

తయారీ పద్ధతి:

పైన పేర్కొన్న పప్పులు, కిడ్నీ బీన్స్  మెంతులను కనీసం 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. మఖానాను మాత్రం గ్రైండ్ చేసే అరగంట ముందు నానబెడితే సరిపోతుంది.

నానిన పదార్థాలన్నింటినీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని అప్పటికప్పుడే వాడుకోవడం మంచిది లేదా రాత్రంతా పులియబెడితే ఇడ్లీలు మరింత మృదువుగా వస్తాయి.

ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి రాసి, పైన తురిమిన క్యారెట్, కొత్తిమీర లేదా బీట్‌రూట్ వేసి పిండిని పోయాలి. ఆవిరిపై ఉడికిస్తే వేడివేడి ప్రోటీన్ ఇడ్లీలు సిద్ధం!

ఈ ఇడ్లీ తింటే కలిగే ప్రయోజనాలు:

ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు త్వరగా నిండిన అనుభూతి కలుగుతుంది, ఫలితంగా అనవసరమైన ఆకలి కోరికలు తగ్గుతాయి.

కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

మెంతులు పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు.

ఈ ఇడ్లీలు తింటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ!
ఈ ఇడ్లీలు తింటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ!
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.