అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు.. 30 మంది ప్రయాణీకుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అమల ట్రావెల్స్‎కు చెందిన బస్సు30 మందితో ప్రయాణిస్తోంది. అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈమధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం యాజమానులకు పెద్ద తలనొప్పిగా మారింది.

అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు.. 30 మంది ప్రయాణీకుల ఆందోళన
Road Accident
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Srikar T

Updated on: May 26, 2024 | 3:49 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అమల ట్రావెల్స్‎కు చెందిన బస్సు30 మందితో ప్రయాణిస్తోంది. అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈమధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం యాజమానులకు పెద్ద తలనొప్పిగా మారింది. అతి వేగంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలన బలిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారుని ఢీ కొట్టిన బస్సు.. ముందు వెళ్తున్న ఆటోని కూడా ఢీకొనడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందారు.

ఆటో, కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రయాణికులు అంతా బస్సు వేగంగా ఉండడంతోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.30 మంది ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సు ఆగగానే కిందికి దిగిపోయారు. ఆటో డ్రైవర్‎కు గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‎కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‎ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‎కి తరలించి చికిత్స అందజేశారు. అతివేగం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..