హైదరాబాద్‎లో ఇకపై వాటిని నో చాన్స్.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్..

రేవ్ పార్టీలు, డ్రగ్ పార్టీలు.. ప్రతీ కాస్మోపాలిటన్ సిటీలో బడాబాబులు నిర్వహించే కామన్ ఈవెంట్స్ ఇవి. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అమ్మాయిలు, లిక్కర్‎తో పాటు డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేసే పార్టీలు. ఇలాంటి పార్టీలు గతంలో హైదరాబాద్‎లో జరిగేవి. కానీ గత కొన్ని రోజులుగా డ్రగ్ పెడ్లర్స్‎పై రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో హైదరాబాద్‎ని వదిలేసి ఇతర నగరాలకు వెళ్లి పార్టీస్ చేసుకుంటున్నారు.

హైదరాబాద్‎లో ఇకపై వాటిని నో చాన్స్.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్..
Hyderabad Police
Follow us

| Edited By: Srikar T

Updated on: May 25, 2024 | 8:30 PM

రేవ్ పార్టీలు, డ్రగ్ పార్టీలు.. ప్రతీ కాస్మోపాలిటన్ సిటీలో బడాబాబులు నిర్వహించే కామన్ ఈవెంట్స్ ఇవి. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అమ్మాయిలు, లిక్కర్‎తో పాటు డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేసే పార్టీలు. ఇలాంటి పార్టీలు గతంలో హైదరాబాద్‎లో జరిగేవి. కానీ గత కొన్ని రోజులుగా డ్రగ్ పెడ్లర్స్‎పై రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో హైదరాబాద్‎ని వదిలేసి ఇతర నగరాలకు వెళ్లి పార్టీస్ చేసుకుంటున్నారు.

గత ఆరు నెలల నుంచి సిటీలో ఎలాంటి డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు జరగడం లేదు. గతంలో హైదరాబాద్ సిటీతో పాటు ఔట్ స్కట్స్‎లో ఉన్న ఫామౌజ్‎లలో ఇలాంటి పార్టీలు చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు కొందరు ప్రముఖులు, యువకులు. డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఇలాంటి పార్టీలు హైదరాబాద్‎లో నిర్వహించాలంటే భయపడుతున్నారు. గత ఆరు నెలలుగా ఎక్కడా ఇలాంటి డ్రగ్స్, రేవ్ పార్టీలు జరగలేదని పోలీసులు చెబుతున్నారు.

గతేడాది బంజారాహిల్స్‎లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‎లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పెద్ద ఎత్తున యువత పట్టుబడ్డారు. ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్ కన్యజ్యూమర్స్‎కి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అలాగే మాదాపూర్‎లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్‎లో డ్రగ్ పార్టీ చేసుకుంటుండగా పోలీసులు రైడ్ చేసి పెడ్లర్స్‎ని అరెస్ట్ చేశారు. ఇవే కాకుండా సిటీ ఔట్ స్కట్స్‎లోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఫామౌజ్‎లో కొందరు యువకులు రేవ్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి రేవ్ పార్టీలు, డ్రగ్ పార్టీలపై గత ఆరు నెలలుగా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సిటీ ఔట్ స్కట్స్‎లోని చేవెళ్ల, మోయినాబాద్, శామీర్ పేట్, ఇబ్రహీంపట్నం లాంటి ఏరియాల్లో ఉన్న ఫామౌజ్‎లపై నిఘా పెంచారు. ఎవరైనా పార్టీస్ చేసుకుంటే.. అందులో లిక్కర్ యూజ్ చేస్తే తప్పకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి టెంపరరీ లిక్కర్ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇక పార్టీలు జరుగుతున్నప్పుడు సడెన్ రైడ్స్ చేసి అక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా అని చెక్ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ పార్టీస్‎లో డ్రగ్స్ వాడాలంటే భయపడుతున్నారు.

హైదరాబాద్‎లో డ్రగ్స్ పార్టీస్ చేసుకోవాలంటే ఇక్కడి పోలీసులకు భయపడుతున్న డ్రగ్ అడిక్ట్స్.. బెంగుళూర్‎తో పాటు ఇతర సిటీస్‎కి వెళ్లి పార్టీస్‎ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‎గా బెంగుళూర్‎లో జరిగిన రేవ్ పార్టీని హోస్ట్ చేసింది తెలుగు వ్యక్తే. అందులో పార్టిసిపేట్ చేసింది కూడా హైదరాబాద్‎తో పాటు ఏపీ కి చెందిన గెస్ట్‎లే ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్‎లో ఇలాంటి పార్టీ చేస్తే పోలీసులకు దొరికిపోతామని భావించి బెంగుళూరుకి వెళ్లి రేవ్ పార్టీ అరేంజ్ చేశారు.

హైదరాబాద్‎కి డ్రగ్స్ సప్లై చేస్తున్న ప్రధాన పెడ్లర్స్‎ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, గోవా నుంచి హైదరాబాద్‎కి డ్రగ్ సప్లై చైన్ కట్ చేశామని చెబుతున్నారు. డ్రగ్ పెడ్లర్స్‎పై పీడీ యాక్ట్‎లు పెట్టడంతో పాటు వారిపై కేసు నమోదు చేసిన నుంచి కోర్టుల్లో శిక్షలు పడేవరకు ప్రాసెస్ అంతా ఫాలో అప్ చేస్తున్నారు పోలీసులు. దీంతో కన్విక్షన్ రేట్ కూడా పెరిగిపోతుండటంతో సిటీకి డ్రగ్స్ సప్లై చేయాలంటే భయపడుతున్నారు. హైదరాబాద్‎లో ఉండే బడాబాబులు, సినీ తారలెవరైనా ఇలాంటి పార్టీలు హోస్ట్ చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నంగ్ ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?
మహేష్ అతిథి మూవీ హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిందేంటీ..
మహేష్ అతిథి మూవీ హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిందేంటీ..
DSC 2024 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఇవాళ్టితో ముగుస్తున్న గడువు
DSC 2024 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఇవాళ్టితో ముగుస్తున్న గడువు
ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం..
ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం..
ఐస్ క్రీం బిజినెస్.. ఎంత లాభం వస్తుందో తెలుసా..?
ఐస్ క్రీం బిజినెస్.. ఎంత లాభం వస్తుందో తెలుసా..?
మీ కారు బ్యాటరీ పాడైందని చెప్పే సంకేతాలు ఇవే.. చెక్ చేసుకోండి..
మీ కారు బ్యాటరీ పాడైందని చెప్పే సంకేతాలు ఇవే.. చెక్ చేసుకోండి..
'కల్కి' ఈవెంట్‌లో ప్రెగ్నెంట్ దీపికకు సాయం చేసిన ప్రభాస్.. వీడియో
'కల్కి' ఈవెంట్‌లో ప్రెగ్నెంట్ దీపికకు సాయం చేసిన ప్రభాస్.. వీడియో
తొలకరితో పులకరింత.. పాలధారలా పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతాలు
తొలకరితో పులకరింత.. పాలధారలా పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతాలు