Maoists: మళ్లీ మొదలైన బూట్ల చప్పుడు.. ఉమ్మడి వరంగల్ జిల్లా అడవుల్లో పోలీసుల కూంబింగ్..
మూడు జిల్లాల సరిహద్దు అడవుల్లో ముమ్మరంగా వేట సాగుతోంది. అణువణువూ జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. శుక్రవారం ఉదయం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal) అడవుల్లో మళ్లీ బూట్ల చప్పుడు. మూడు జిల్లాల సరిహద్దు అడవుల్లో ముమ్మరంగా వేట సాగుతోంది. అణువణువూ జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. శుక్రవారం ఉదయం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. వారి కోసం ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అడవులను జల్లెడ పడుతున్నారు. గూడూరు సర్కిల్‌లోని మట్టెవాడ, దుబ్బగూడెం, కామారం, గంగారం అటవి ప్రాంతాల్లో విస్తృతంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. తాడ్వాయి అడవుల్లోను బలగాల కూంబింగ్ సాగుతోంది.
ఇదిలావుంటే.. ఈనెల 5న తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగిన ఈ సభకు రాష్ట్ర నేత దామోదర్ హాజరైనట్లుగా సామాచారం. మూడంచెల భద్రత వలయంలో మావోయిస్టులు ముగింపు సభ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దాదాపు మూడు వేల మంది ప్రజలతో ముగింపు సభను నిర్వహించారు. ఈ వారోత్సవాల సమయంలోనే.. అక్కిరాజు హరగోపాల్ (Akkiraju Haragopal) అలియాస్ లక్కిదాదా 50 అడుగుల స్మారక స్థూపాన్ని మావోయిస్టులు నిర్మించారు.
వారోత్సవాలు, ముగింపు సభ నిర్వహించుకున్న తర్వాత మావోయిస్టులు మళ్లీ తెలంగాణ ప్రాంతంలో యాక్షన్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏకంగా 42 రోజులపాటు వివిధ కార్యక్రమాలతో వచ్చినవారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు జరిగాయి. పక్కా ప్రణాళికతోనే ఇన్ని రోజులు వారు కార్యక్రమాలు నిర్వహించుకున్నారని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం