Hyderabad: వీడు భర్త కాదు కాలయముడు.. అనుమానం, అదనపు కట్నం కోసం పిల్లల ఎదుటే భార్య గొంతు కోసి హత్య

దివ్యభారతి తండ్రి.. మూడు నెలల క్రితం అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీపక్ ఇక నుంచి అదనపు కట్నం కోసం వేధించనని ఒప్పుకున్నాడు.

Hyderabad: వీడు భర్త కాదు కాలయముడు.. అనుమానం, అదనపు కట్నం కోసం పిల్లల ఎదుటే భార్య గొంతు కోసి హత్య
Hyderabad News
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2022 | 10:11 AM

Hyderabad: కష్ట సుఖాల్లో జీవితాంతం తోడు ఉంటానని.. నిండు నూరేళ్లు కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తూ భార్య మేడలో తాళికట్టిన భర్త.. ఆ ప్రమాణాల్నీ మరచిపోయాడు. ఓ వైపు అనుమానం.. మరోవైపు ధన దాహంతో భార్యపాలిట మృత్యువుగా మారాడు కట్టుకున్న భర్త. తన పిల్లల ముందే భార్య గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్‌ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉమ్మడి కరీం నగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన దివ్యభారతి(33)కి 12 ఏళ్ల క్రితం అంబర్‌పేటకు చెందిన దీపక్‌(40)తో పెళ్లి జరిగింది. అప్పుడు దివ్య భారతి తల్లిదండ్రులు కట్నకానుకలను దీపక్ కు భారీగానే ముట్టచెప్పారు.  ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప, బాబు.. పిల్లలు ఓ కార్పొరేట్ స్కూల్ లో ఐదో తరగతి, మూడో తరగతి చదువుతున్నారు. దివ్యభారతి కూడా ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఉద్యోగం చేస్తోంది. అయితే దీపక్ మనసులో అనుమాన భూతం చేరుకుంది.. దీంతో దివ్యభారతి ఓ వైపు అనుమానంతో వేధిస్తూనే మరోవైపు అదనపు కట్నం కావాలంటూ ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో దివ్యభారతి తండ్రి.. మూడు నెలల క్రితం అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీపక్ ఇక నుంచి అదనపు కట్నం కోసం వేధించనని ఒప్పుకున్నాడు. అయితే గత 10 రోజుల తర్వాత మళ్ళీ దీపక్ మొదటి వచ్చాడు.. దివ్యభారతి వేధించడం మొదలు పెట్టాడు. గత కొన్ని రోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు. అర్ధరాత్రిలో భార్యమీద దడి చేశాడు.. దివ్యభారతి అరుపులతో పిల్లలతో పాటు ఇరుగుపొరుగు నిద్రలేచారు. అప్పటికే భార్య గొంతుకోసి హత్య చేశాడు దీపక్.

చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పారిపోవాలని చూసిన దీపక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..