Financial Crisis: ఉద్యోగం లేదు, ఆర్ధిక ఇబ్బందులని 11 నెలల చిన్నారిని నదిలోకి విసిరి చంపేసిన తండ్రి
గుజరాత్‌కు చెందిన ముకేశ్ అనే వ్యక్తి 11 నెలల చిన్నారి రాజ్ వీర్ ను నర్మదా నదిలోకి విసిరేశాడు. ఉద్యోగంలేదు.. ఆర్ధిక ఇబ్బందులు అనే కారణంతో కన్న బిడ్డనే చంపేశాడు. ఈ దారుణ ఘటన సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధేశ్వర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Financial Crisis: తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. తమకు పుట్టిన 11 నెలల చిన్నారి బాలుడిని ఆర్ధిక సమస్యలున్నాయని.. సరైన ఉద్యోగం లేదంటూ.. కాల్వలోకి విసిరి చంపేశాడు ఓ ప్రభుద్దుడు. ఆ తర్వాత పసికందును తన తండ్రి వద్ద దింపానని భార్యకు అబద్ధం చెప్పాడు.. చేసిన పాపం పండి.. పోలీసులకు చిక్కాడు. హృదయవిదారకమైన ఈ దారుణ ఘటనన రాజస్థాన్ లోని జాలోర్ జిల్లాలో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన ముకేశ్ అనే వ్యక్తి 11 నెలల చిన్నారి రాజ్ వీర్ ను నర్మదా నదిలోకి విసిరేశాడు. ఉద్యోగంలేదు.. ఆర్ధిక ఇబ్బందులు అనే కారణంతో కన్న బిడ్డనే చంపేశాడు. ఈ దారుణ ఘటన సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధేశ్వర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించి, చివరకు కుమారుడిని చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే..
నలోధార్ గ్రామానికి చెందిన ముకేశ్ .. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన ఉష అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కులాలు వేరుకావడంతో ముకేశ్ తండ్రి ఈ పెళ్ళికి అంగీకరించలేదు. దీంతో ఈ దంపతులు అహ్మదాబాద్‌లో కాపురం పెట్టారు. ఈ దంపతులకు 11 నెలల బాబు రాజ్‌వీర్ ఉన్నాడు. ముకేశ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అయితే సెక్యూరిటీ గార్డు ఉద్యోగం నుంచి ముఖేష్ ను తీసేశారు. దంపతులు తమ కుమారుడికి మంచి జీవితాన్ని అందించాలని కోరుకున్నారు. కానీ ముఖేష్ కు ఉద్యోగం లేకపోవడంతో సంపాదన లేకుండా పోయింది. కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో ముఖేష్ కొంతకాలం బిక్షాటన చేసి.. ఫ్యామిలీని పోషించాడు. సరైన ఉద్యోగం జీతం లేదు. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని ముఖేష్ ఆలోచించాడు. ఈ మేరకు ఓసారి ప్రయత్నిస్తే.. ఆ ప్రయత్నం విఫలం అయింది. రెండోసారి ప్రయత్నంలో భాగంగా 11 నెలల చిన్నారిని తాతయ్యల వద్ద వదిలివేసి వస్తానని ముకేశ్ తన భార్యను కోరగా ఉష దానికి అంగీకరించింది. దీంతో ముఖేష్ తనతో పాటు 11 నెలల చిన్నారి బాలుడిని తీసుకుని వెళ్ళాడు. సిద్ధేశ్వర్ గ్రామంలోని నర్మదా నదిలోకి విసిరాడు.
అయితే, పసికందు రాజ్ వీర్ ను కాలువలోకి విసిరేస్తున్న ముఖేష్‌ను స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో ముఖేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాలువలో చిన్నారి కోసం వెతకగా.. ఘటనా స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షల అనంతరం మున్సిపాలిటీ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..