తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే

తెలంగాణలో డేటింగ్ యాప్ నేరాలు విపరీతంగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఏకంగా 46శాతం ఎక్కువగా డేటింగ్ యాప్ ద్వారా నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆన్లైన్ యాప్స్ ఎక్కువగా అలవాటుపడ్డ యువత డేటింగ్ యాప్‎లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. డేటింగ్ ఆప్‎లోను ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బాధితుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలు ఎక్కువయ్యాయి. డేటింగ్ యాప్‎ల ద్వారా సంతోషం కంటే రిస్క్‎లు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
Dating App
Follow us

| Edited By: Srikar T

Updated on: May 04, 2024 | 9:16 PM

తెలంగాణలో డేటింగ్ యాప్ నేరాలు విపరీతంగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఏకంగా 46శాతం ఎక్కువగా డేటింగ్ యాప్ ద్వారా నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆన్లైన్ యాప్స్ ఎక్కువగా అలవాటుపడ్డ యువత డేటింగ్ యాప్‎లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. డేటింగ్ ఆప్‎లోను ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బాధితుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలు ఎక్కువయ్యాయి. డేటింగ్ యాప్‎ల ద్వారా సంతోషం కంటే రిస్క్‎లు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 2020 నుండి ప్లే స్టోర్ లోను డేటింగ్ యాప్స్ ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా యువత ఎక్కువ సంఖ్యలో దీనికి ఆకర్షితులు అవుతున్నారు. బాధితులు సైతం యువకులే ఎక్కువగా ఉంటున్నారు. ఫేక్ ప్రొఫైల్స్‎ని క్రియేట్ చేసి ముగ్గులోకి దింపి అన్ని వివరాలు రాబట్టి, అశ్లీల ఫోటోలు వీడియోలు సైతం సేకరించిన తర్వాత తిరిగి వారిని బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు ప్రతిరోజు హైదరాబాదులో చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాదులో ఇటీవల జరిగిన ఒక కేసులో దినేష్ అనే యువకుడు quack quack అనే డేటింగ్ యాప్ ద్వారా ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తన అసలు పేరు, బదులు శ్వేతా శెట్టి పేరుతో డేటింగ్ యాప్‎లో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి బాధితులను వలలోకి లాగాడు. తను మగవాడు అయినప్పటికీ అమ్మాయిగా నటిస్తే ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆన్లైన్ రిలేషన్షిప్ మైంటైన్ చేసి వివిధ కారణాలు చెప్పి రూ.4 లక్షల రూపాయలు మోసం చేశాడు. డేటింగ్ యాప్‎పై ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా పెంచారు. దీని ద్వారా చోటు చేసుకుంటున్న నేరాలు అధికంగా ఉంటుండడంతో పోలీసులు వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ యాప్‎లో మహిళలు మగవారిని మోసం చేస్తున్న వాటితో పోలిస్తే మగవారు అమ్మాయిలుగా నటిస్తూ మోసం చేస్తున్న వారీ సంఖ్యని ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అనలైజ్ చేశారు.