Watch Video: రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్..

Watch Video: రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్..

Peddaprolu Jyothi

| Edited By: Srikar T

Updated on: May 04, 2024 | 7:38 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మందు బాబుల వీరంగం సృష్టించాడు. సహనం కోల్పోయి మందుబాబులపై పోలీసులు చేయి చేసుకున్నారు. చంపాపేట్‎లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డరు కొందరు యువకులు. దీంతో వారి బైకులు స్వాధీనం చేసుకున్నారు మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు. బైకులు స్వాధీనం చేసుకోవడంతో మందుబాబులు రోడ్డుపై వీరంగం సృష్టించారు.

హైదరాబాద్, మే 4: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మందు బాబుల వీరంగం సృష్టించాడు. సహనం కోల్పోయి మందుబాబులపై పోలీసులు చేయి చేసుకున్నారు. చంపాపేట్‎లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డరు కొందరు యువకులు. దీంతో వారి బైకులు స్వాధీనం చేసుకున్నారు మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు. బైకులు స్వాధీనం చేసుకోవడంతో మందుబాబులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో ఓ బైక్‎ను ధ్వంసం చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సహనం కోల్పోయి మందుబాబులను అదుపు చేయడానికి చేయి చేసుకున్నారు పోలీసులు. పోలీసులు చేయి చేసుకోవడంతో తాగి ఉన్న యువకులు మరింత రెచ్చిపోయారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది ఈఘటన. అయితే కాసేపు అనంతరం ఈ వివాదం సర్థుమణిగింది. మద్యం సేవించిన మందుబాబులను నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు ట్రాఫిక్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..