AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్‌కు వచ్చిన రైతన్నకు బ్యాండ్ వేద్దామనుకున్న దళారులు.. తర్వాత అతనెవరో తెలిసి షాక్!

అడవుల జిల్లాలో రైతులను టార్గెట్ చేసి నిండా ముంచుతున్న నయా కేటుగాళ్ల భరతం పట్టారు జిల్లా పోలీసులు. అలా.. ఇలా.. కాదు రైతు వేశాధారణలో వెళ్లి రైతులను మోసం చేస్తున్న బ్యాంకు బ్రోకర్లను పట్టుకున్నారు. ఏక కాలంలో నాలుగు మండలాల్లో రైడ్స్ నిర్వహించి రైతులను నిండా ముంచుతున్న దళారుల తాట తీశారు.

బ్యాంక్‌కు వచ్చిన రైతన్నకు బ్యాండ్ వేద్దామనుకున్న దళారులు.. తర్వాత అతనెవరో తెలిసి షాక్!
Police Caught Frauders
Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 05, 2025 | 8:29 PM

Share

అడవుల జిల్లాలో రైతులను టార్గెట్ చేసి నిండా ముంచుతున్న నయా కేటుగాళ్ల భరతం పట్టారు జిల్లా పోలీసులు. అలా.. ఇలా.. కాదు రైతు వేశాధారణలో వెళ్లి రైతులను మోసం చేస్తున్న బ్యాంకు బ్రోకర్లను పట్టుకున్నారు. ఏక కాలంలో నాలుగు మండలాల్లో రైడ్స్ నిర్వహించి రైతులను నిండా ముంచుతున్న దళారుల తాట తీశారు.

గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లోన్ రెన్యూవల్ కోసం రైతుల నుండి కమిషన్ తీసుకుంటూ మోసం చేస్తున్న 9 మంది బ్రోకర్లను రైతు వేషంలో వెళ్లి పట్టుకున్నారు. ఇచ్చోడ సీఐ బి. రాజు నేతృత్వంలో పోలీసులు పక్కా ఫ్లాన్‌తో దాడి చేసి పట్టుకున్నారు. బ్యాంకులో రైతులను మోసం చేస్తున్న 9 మందిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇదే స్టైల్‌లో జిల్లా వ్యాప్తంగా 34 మంది పై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు‌.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతి ఏడాది రైతుకు బ్యాంకు ద్వారా రుణం లభిస్తుందని, ఆ రుణానికి ఏడు శాతం వడ్డీ ఉంటుందని, ఒకవేళ సంవత్సరంలోపు రుణాన్ని తీరిస్తే, మూడు శాతం బోనస్ తిరిగి వస్తుంది. అంతేకాదు ఆ రుణాన్ని కట్టిన తర్వాత తదుపరి రుణం 20 నుండి 30 శాతం వరకు పెంచి బ్యాంకు ద్వారా రైతులు తిరిగి మళ్లీ రుణాన్ని సంపాదించవచ్చు. ప్రభుత్వం ఇలాంటి సౌలభ్యం రైతులకు అందించిందని ప్రజలందరికీ తెలుసు..!

అయితే బ్యాంకుల ద్వారా ఉన్న ఈ లొసుగులను వాడుకుంటున్న మోసగాళ్లు, కేటుగాళ్లు జిల్లాలోని అమాయక రైతుల వద్ద ప్రతి ఏడాది రైతులకు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా కట్టేసి, తిరిగి రైతులకు అధిక రుణాన్ని తీసుకున్న దానికన్నా అధికంగా వచ్చేలా చేసి, వచ్చిన తేడాలో రైతుల వద్ద నుండి దాదాపు ఒక రైతు నుండి రూ. 5,000 నుండి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని పోలీసులకు ఉప్పందింది.

అంతే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో.. బుధవారం(జూన్ 04) జిల్లా వ్యాప్తంగా 9 మండలాలలో సీఐ, ఎసై స్థాయి అదికారులు రైతులుగా వేషం కట్టి 16 బృందాలుగా విడిపోయి బ్యాంకులకు చేరుకున్నారు. అప్పటికే రైతులను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో సిద్దంగా ఉన్న బ్యాంక్ బ్రోకర్లు రైతుల వేషంలో ఉన్న పోలీసులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. రైతు రుణమాఫీ డబ్బులు మొత్తం తామే కట్టి ఎక్కువ రుణాన్ని కేటాయించి వచ్చిన దానిలో తమకు వాటా ఇయ్యాలని బేరసారాలు మొదలెట్టారు.

చివరకు రైతు వేషంలో ఉన్న ఓ సీఐ తో రైతు రుణ మాఫీ డబ్బులు సైతం కట్టించి, తిరిగి రుణం పొందేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే, ఆ రైతు వేషంలో ఉన్నది సీఐ అని తెలిసి కంగుతిన్నారు. ఇలా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ దళారి దందా గుట్టు రట్టవడంతో నయా మాఫియా బాగోతం బట్టబయలైంది. 9 మండలాల్లో బ్యాంకులే రుణమాపినే టార్గెట్ గా రైతులను మోసం చేస్తున్న 34 మంది దళారులను రెడ్ హ్యాండెడ్గా పెట్టుకున్నారు పోలీసులు.

ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను దుర్వినియోగం చేస్తూ ప్రతి ఏడాది రైతుల వద్ద నుండి డబ్బులను దండుకుంటున్న దళారుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని దళారులు, మధ్యవర్తులను రైతులకు దూరంగా ఉండే విధంగా సూచనలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, నేరడిగొండ, ఇచ్చోడా, బేల, తలమడుగు, బీంపూర్, మావల, ఇంద్రవెల్లి ప్రాంతాలలో జిల్లా పోలీసులు స్వయంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 34 మంది నిందితులను పట్టుకోవడం జరిగిందని, వారందరిపై ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సెక్షన్ 318 ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..