AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి పీఎం మోడీ పర్యటన ప్రారంభంకానుంది.

PM Narendra Modi: ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2022 | 6:00 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి పీఎం మోడీ పర్యటన ప్రారంభంకానుంది. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించి.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 1.35కి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి 1.40కి విమానాశ్రయంలో బీజేపీ పబ్లిక్ మీటింగ్ ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ 1.40 నుంచి 2 గంటల వరకు.. అంటే, 20 నిమిషాలపాటు పాల్గొంటారు. 2గంటల 05 నిమిషాలకు మీటింగ్ ప్లేస్ నుంచి నుంచి బయల్దేరి 2.10కి తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

పీఎం మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్..

  • బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్ లో రామగుండం బయల్దేరి వెళ్తారు. మూడూ ఇరవైకల్లా రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. మూడు ఇరవై ఐదుకి.. రామగుండం హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి.. మూడున్నరకు రామగుండం R. F. C. L ప్లాంట్‌కు చేరుకుంటారు.
  • అరగంట పాటు RFCLలో పర్యటిస్తారు. తర్వాత 4.05 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరి 4.15 నిమిషాలకు సభాస్థలికి చేరుకుంటారు.
  • సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకూ రామగుండంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • ఆ తర్వాత 5.20కి అక్కడి నుంచి బయలుదేరి.. 5.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
  • సాయంత్రం 5.30 నిమిషాకలు హెలీక్యాప్టర్ ద్వారా.. రామగుండం నుంచి బయల్దేరి 6.35కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.40కి బేగంపేట్ నుంచి బయల్దేరి రాత్రి 8.50కి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ప్రధాని రామగుండం టూర్ సందర్భంగా.. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఇప్పటికే పీఎంఓతో పాటు సెంట్రల్ హోం మినిస్ట్రీ నుంచి కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌కి ఆదేశాలు అందాయి. పీఎం సెక్యూరిటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేందుకు పీఎం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను సంప్రదించాల్సిందిగా పీఎంఓ సూచించింది.

ప్రధాని మోదీ తెలంగాణ వస్తుండటంతో.. టీబీజేపీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.. ఇటివల అతికొద్ది వ్యవధిలో, రెండోసారి మోదీ రాక సందర్భంగా.. కమలనాథులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానికి స్వాగతం పలికే సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బేజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాని మోడీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్, వామపక్షనేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే.. పీఎం మోడీ రాకను వ్యతిరేకిస్తూ పలు చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..