Hyderabad Ragging: హైదరాబాద్‌లో మళ్లీ ర్యాగింగ్ భూతం.. ఐబీఎస్ కాలేజీలో జూనియర్‌పై సీనియర్ల దాడి..
హైదరాబాద్ నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం పురివిప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని IBS కాలేజీలో ఓ విద్యార్ధిని.. చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

హైదరాబాద్ నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం పురివిప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని IBS కాలేజీలో ఓ విద్యార్ధిని.. చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని రూమ్‌లో బందించి.. కొందరు సీనియర్ విద్యార్థులు చితకబాదారు. పిడిగుద్దులు గుద్దుతూ.. తీవ్రంగా గాయపర్చారు. ముఖం మీద పౌడర్ చల్లి తీవ్రంగా కొట్టారు. దాడి చేసిన విద్యార్ధులపై మరో వర్గం దాడి చేసింది. ఈ ర్యాగింగ్ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో.. ఇరు వర్గాలను మందలించి పంపించినట్టు తెలుస్తోంది.
దెబ్బలు తట్టుకోలేని బాధిత విద్యార్ధి.. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. ఘటన గురించి తెలుసుకుని భయబ్రాంతులకు గురైన తల్లిందడ్రులు.. వెంటనే క్యాంపస్‌కి వచ్చి తమ పిల్లాడిని తీసుకెళ్లారు. ఈ వీడియోపై నెటిజన్లు మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్గ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ విషయంపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు అందడంతో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది.




IBS కాలేజీ విద్యార్ధులకు.. దొంతనపల్లి గ్రామ శివారులో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ కూడా ఎప్పటినుంచో జరుగుతున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
