Sabitha Indra Reddy: ఆందోళన విరమించి క్లాసెస్ కు అటెండ్ కావాలి.. విద్యార్థులకు మంత్రి సబితా సూచన..

నిజాం కాలేజీ ఇష్యూ పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెస్పాండ్ అయ్యారు. తొలిసారి యూజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త భవనంలో 50 శాతం సీట్లు ఇస్తామన్న ప్రకటనకు విద్యార్థులు..

Sabitha Indra Reddy: ఆందోళన విరమించి క్లాసెస్ కు అటెండ్ కావాలి.. విద్యార్థులకు మంత్రి సబితా సూచన..
Sabitha Indra Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 11, 2022 | 8:19 PM

నిజాం కాలేజీ ఇష్యూ పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెస్పాండ్ అయ్యారు. తొలిసారి యూజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త భవనంలో 50 శాతం సీట్లు ఇస్తామన్న ప్రకటనకు విద్యార్థులు ఓకే అన్నారని, వారు రాతపూర్వకంగా హామీ అడగడంతో కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. . విద్యార్థులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యాసాధ్యాలు అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి.. యూజీ – పీజీ కి 50 – 50 ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇది ఎంతవరకు సాధ్యం అనేది విద్యార్థులు కూడా అర్దం చేసుకోవాలని కోరారు. వచ్చే ఏడాది ఏం చేయాలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాబట్టి విద్యార్థులు ఆందోళన విరమించి క్లాసెస్ కి అటెండ్ కావాలని విజ్ఞప్తి చేశారు.

కాగా.. హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన విరమణపై హైడ్రామా కొనసాగుతోంది. హాస్టల్‌ 50-50 ఆప్షన్‌, మరో ఫ్లోర్‌ నిర్మాణం హామీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రతిపాదనతో కొందరు విద్యార్థులు ఆందోళన విరమించారు. హాస్టల్‌ కేటాయింపు, ఫ్లోర్‌ నిర్మాణంపై రాతపూర్వక హామీ వచ్చాకే ఆందోళన విరమిస్తామని కొందరు విద్యార్థులు చెప్పారు. హాస్టల్‌ 50-50 ఆప్షన్‌కు అస్సలు ఒప్పుకునేదే లేదని భీష్మించారు. దాంతో ఆందోళన విమరణపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. మరోవైపు హాస్టల్‌ కేటాయింపుపై సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వస్తాయని కొంతమంది విద్యార్థులు భావిస్తున్నారు.

మరోవైపు.. హాస్టల్ బిల్డింగ్ కోసం నిజాం కాలేజీలో స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే సరిచేయచాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచిస్తూ ట్వీట్ చేశారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్కు ఆదేశాలు జారీ చేశారు. నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యూయేషన్ డేకు అటెండైన పూర్వ విద్యార్థి, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతో కాలేజీ హాస్టల్ నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..